యల్లంపేటలో కార్యకర్తలను పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే డి ఎస్ రెడ్యా నాయక్.
మరిపెడ,జూన్20(నమస్తే న్యూస్).మరిపెడ మండలం యల్లంపేట గ్రామంలో అనారోగ్యంతో బాధపడుతున్న ఇద్దరిని డోర్నకల్ మాజీ ఎమ్మెల్యే డి ఎస్ రెడ్యా నాయక్ శనివారం స్వగృహాల్లో పరామర్శించారు.గ్రామానికి చెందిన రాగం సోమయ్య మూత్ర సంబంధిత వ్యాధితో చికిత్స పొంది ఇంటికి తిరిగి వచ్చారు.ఆయనను మాజీ ఎమ్మెల్యే డి ఎస్ రెడ్యా నాయక్ కలిసి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు.త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.అనంతరం అదే గ్రామానికి చెందిన చిన్న గండి వెంకటయ్య పక్షవాతంతో బాధపడుతుండగా డి ఎస్ రెడ్యా నాయక్ స్వగృహంలో పరామర్శించి,ధైర్యం చెప్పారు.కుటుంబ సభ్యులకు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.ఈ కార్యక్రమంలో తాళ్లపల్లి శ్రీను,గండి పరమేష్,రమేష్,హరీష్,లింగయ్య,అంబరీష్,ఉపేందర్,ప్రతాపరెడ్డి,భరత్,వీరన్న తదితరులు పాల్గొన్నారు.


