Type Here to Get Search Results !

పాలకుల అసమర్థ విధానాల వల్లే ధరల పెరుగుదల:సీపీఐ జిల్లా కార్యదర్శి బి విజయసారధి

  • పాలకుల అసమర్థ విధానాల వల్లే ధరల పెరుగుదల.
  • కార్పొరేట్ శక్తులకు దాసోహమై సామాన్యులపై భారం. 
  • సీపీఐ జిల్లా కార్యదర్శి బి విజయసారధి ధ్వజం.




డోర్నకల్/మరిపెడ,జూన్ 20(నమస్తే న్యూస్)కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు కార్పొరేట్ శక్తులకు దాసోహమై సామాన్యులపై పెను భారాన్ని మోపుతున్నాయని సీపీఐ జిల్లా కార్యదర్శి బి విజయసారధి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.మరిపెడ మండల కేంద్రంలో శనివారం జరిగిన సీపీఐ మండల కౌన్సిల్ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆయన మాట్లాడారు.దళారులుగా మారిన ప్రభుత్వాలు కార్పొరేట్ శక్తులకు వేల కోట్ల ప్రజాధనాన్ని దోచిపెడుతున్నాయని ఆరోపించారు.నిత్యావసర వస్తువుల ధరలతో పాటు పెట్రోల్,డీజిల్,గ్యాస్ ధరలను విపరీతంగా పెంచి సామాన్యులపై మోయలేని భారం వేస్తున్నాయని మండిపడ్డారు.మాటల గారడీతో పాలన సాగించడం కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలకు అలవాటుగా మారిందని విమర్శించారు.రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎన్నికల్లో హామీ ఇచ్చిన విధంగా ఆసరా పెన్షన్లను పెంచాలని,అర్హులైన వారందరికీ ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయాలని,నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాలని విజయసారధి డిమాండ్ చేశారు.గత ప్రభుత్వం నిర్మించిన వందలాది డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లు పడావు పడ్డాయని,వాటిని వెంటనే అర్హులైన పేదలకు పంపిణీ చేయాలని ప్రభుత్వాన్ని కోరారు.ప్రజా సమస్యల పరిష్కారం కోసం సీపీఐ ఆధ్వర్యంలో పోరాటాలను ఉధృతం చేస్తామని,ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడతామని ఆయన హెచ్చరించారు.

కార్మికులు,కర్షకులు,మధ్యతరగతి ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను పట్టించుకోకుండా పాలకులు కార్పొరేట్లకు కొమ్ముకాస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.ఈ సమావేశంలో సీపీఐ జిల్లా సహాయ కార్యదర్శి,ఆత్మ కమిటీ చైర్మన్ నల్లు సుధాకర్ రెడ్డి,మండల కార్యదర్శి మారగాని బాలకృష్ణ,నాయకులు అబ్దుల్ రషీద్,మల్లేపాక యాకన్న,నారాయణ,పి వెంకన్న,వీరన్న,ఎం వెంకన్న,పి రమేష్,హన్మంతు తదితరులు పాల్గొన్నారు...

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.