విత్తన మేళాను సందర్శిన జిల్లా కలెక్టర్ మరియు జిల్లా మేజిస్ట్రేట్ స్నేహ శబరిష్.
రాబోయే ఎల్ నినో ప్రభావాన్ని ఎదుర్కొనేలా రైతులు జాగ్రత్తలు తీసుకోవాలి.
 |
స్థానిక రైతులతో మాట్లాడుతున్న జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్
|
దంతాలపల్లి,జూన్ 28(నమస్తే న్యూస్)23 జూన్ నుండి 30వ తారీకు వరకు రైతు వేదికల లో విత్తనమేళను ఏర్పాటు చేయడం జరిగిందని ఈ విత్తనమేలను దంతాలపల్లి మండల రైతులందరూ సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ మరియు జిల్లా మేజిస్ట్రేట్ స్నేహ శబరిష్ సూచించారు.దంతాలపల్లి మండలం కేంద్ర లో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా వారం రోజుల పాటు చేపట్టిన విత్తన మేళా లోని స్టాల్స్ ని నేడు జిల్లా కలెక్టర్ మరియు జిల్లా మేజిస్ట్రేట్ స్నేహ శబరిష్ సందర్శించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రతి రైతు తప్పకుండా యూరియా వాడకన్ని తగ్గించి నానో యూరియా వాడకాన్ని అలవాటు చేసుకోవాలని వారు సూచించడం జరిగింది.ఈ కార్యక్రమంలో వారు రైతులతో మాట్లాడి రైతులకు సంబంధించిన సమాచారం వ్యవసాయ శాఖ వాట్సాప్ గ్రూపులో అందుతున్నాయా అనే అంశాన్ని పరిశీలించడం జరిగింది.ఈ మేరకు రైతుల నుంచి వివరాలు అడిగి తెలుసుకోవడం జరిగింది.ఎలినినో ప్రభావంతో దేశ వ్యాప్తంగా ముఖ్యంగా తెలంగాణ లో వర్షపాతం తక్కువగా ఉండే అవకాశం ఉందని, దీంతో రైతులు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. మెట్ట పంటలు వేయాలని కోరారు.ఈ కార్యక్రమంలో ఏడిఐ ఇన్చార్జి శ్రీదేవి గారు మరియు మండల తహసీల్దార్ సునీల్ రెడ్డి మండల వ్యవసాయ అధికారి వాహిని,ఏఈవో హర్షవర్ధన్ , విత్తన డీలర్లు మరియు రైతులు పాల్గొన్నారు.
 |
| స్థానిక రైతులతో మాట్లాడుతున్న జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్ |