Type Here to Get Search Results !

ఎస్ఐఆర్ ప్రక్రియను పకడ్బందీగా చేపట్టాలి:రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి సుదర్శన్ రెడ్డి.

ఎస్ఐఆర్ ప్రక్రియను పకడ్బందీగా చేపట్టాలి
రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి సుదర్శన్ రెడ్డి.



మహబూబాబాద్,జూన్ 19(నమస్తే న్యూస్)స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్ఐఆర్) ప్రక్రియను పకడ్బందీగా నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి సుదర్శన్ రెడ్డి అధికారులను ఆదేశించారు.ఎస్ఐఆర్ ప్రక్రియ నిర్వహణపై రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి సుదర్శన్ రెడ్డి అన్ని జిల్లాల కలెక్టర్లతో  వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా జిల్లా సమీకృత కలెక్టర్ కార్యాలయంలోని వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుంచి అదనపు కలెక్టర్ (రెవెన్యూ) కె. అనిల్ కుమార్ తో కలిసి *జిల్లా కలెక్టర్ స్నేహ శబరిష్* హాజరయ్యారు.ఈ వీసీలో భాగంగా రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి మాట్లాడుతూ.. అన్ని జిల్లాలలో ఎస్ఐఆర్ ప్రక్రియలో భాగంగా ఎన్యుమరేషన్ ఫారంల పంపిణీ, తిరిగి స్వీకరణ, తదితర అంశాలను పకడ్బందీగా చేపట్టాలన్నారు. బూత్ లెవెల్ అధికారులకు తప్పనిసరిగా అన్ని అంశాలపై అవగాహన ముఖ్యమన్నారు.

జిల్లాల వారిగా ఎస్ఐఆర్ ప్రక్రియ నిర్వహణకు చేపట్టిన చర్యలు, రాజకీయ పార్టీల ప్రతినిధుల సమావేశాల వివరాలు కలెక్టర్ల ద్వారా తెలుసుకున్నారు. ప్రక్రియను మొత్తం కలెక్టర్లు, ఉన్నతాధికారులు క్షేత్రస్థాయిలో పర్యవేక్షించాలని తెలిపారు.ఈ వీసీలో జిల్లా కలెక్టర్ స్నేహశబరిష్ మాట్లాడుతూ ఎస్ఐఆర్ ప్రక్రియను మొత్తం పకడ్బందీగా నిర్వహిస్తామన్నారు.ఎస్ఐఆర్ ప్రక్రియను నిరంతరం క్షేత్రస్థాయిలో పర్యవేక్షిస్తామని తెలిపారు.ఈ వీసీలో ఎన్నికల విభాగం పర్యవేక్షకులు పవన్,ఇతర సంబంధిత అధికారులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.