Type Here to Get Search Results !

మరిపెడలో ముమ్మరంగా పల్స్ పోలియో రెండో రోజు కార్యక్రమం.

  • మరిపెడలో ముమ్మరంగా పల్స్ పోలియో రెండో రోజు కార్యక్రమం.
  • కొనసాగనున్న ఇంటింటి వ్యాక్సినేషన్.



డోర్నకల్/మరిపెడ(జూన్ 29)నమస్తే న్యూస్.మండలం మరియు పురపాలక సంఘం పరిధిలో పల్స్ పోలియో నిర్మూలన కార్యక్రమం రెండో రోజు విజయవంతంగా కొనసాగింది. వైద్యాధికారి పర్యవేక్షణ:మరిపెడ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి డాక్టర్ గుగులోతు రవి పర్యవేక్షణలో వైద్య బృందాలు క్షేత్రస్థాయిలో పర్యటించాయి.నిన్న మొదటి రోజు వివిధ కారణాల వల్ల పోలియో చుక్కలు వేయించుకోలేక మిగిలిపోయిన ఐదేళ్లలోపు పిల్లలను గుర్తించి,నేడు ప్రతి ఇంటికి వెళ్లి సిబ్బంది పోలియో వ్యాక్సిన్ వేశారు.పాల్గొన్న వైద్యులు:ఈ కార్యక్రమంలో డాక్టర్ పూజిత,డాక్టర్ సౌజన్య,డాక్టర్ వెంకన్న,డాక్టర్ స్వామి,డాక్టర్ కిరణ్ పాల్గొని వ్యాక్సినేషన్ ప్రక్రియను పర్యవేక్షించారు.పబ్లిక్ హెల్త్ నర్స్ మంగమ్మ,పర్యవేక్షకులు ఆచార్యులు,లలిత కుమారితో పాటు పల్లె దవాఖాన సిబ్బంది,ఎఎన్ఎమ్‌లు,ఆరోగ్య సహాయకులు మరియు ఆశా కార్యకర్తలు ఈ ఇంటింటి సర్వేలో చురుగ్గా పాల్గొన్నారు.పల్స్ పోలియో కార్యక్రమం రేపు మూడవ రోజు కూడా ముమ్మరంగా కొనసాగుతుందని వైద్యాధికారి డాక్టర్ రవి తెలిపారు.ఇంకా ఎవరైనా పిల్లలు మిగిలి ఉంటే రేపు కూడా వారి ఇళ్లకు వచ్చి చుక్కలు వేస్తారని,తల్లిదండ్రులు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని ఆయన కోరారు.




Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.