- సర్పంచ్ నారెడ్డి కవిత-సుదర్శన్ రెడ్డి కృషితో
- గాలివారిగూడెం ప్రభుత్వ పాఠశాలకి,క్రివి సేవాసంస్థ చేయూత.
డోర్నకల్/మరిపెడ(జూన్ 29)నమస్తే న్యూస్.మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలం,గాలివారిగూడెం గ్రామ పంచాయతీ పరిధిలోని మండల పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాలకు సర్పంచ్ నారెడ్డి కవిత-సుదర్శన్ రెడ్డి ప్రత్యేక చొరవ తీసుకున్నారు.వారి విజ్ఞప్తి మేరకు క్రివి సేవాసంస్థ ఫౌండర్ వేములపెల్లి జ్యోతి - శ్రీరాములు పాఠశాలకు వాటర్ ఫిల్టర్ ను,స్టేషనరి,స్కూల్ బ్యాగులు తదితర వస్తువులను అందజేశారు.సోమవారం పాఠశాల ఆవరణలో జరిగిన పంపిణీ కార్యక్రమంలో సర్పంచ్ నారెడ్డి కవిత-సుదర్శన్ రెడ్డి స్వయంగా పాల్గొని,క్రివి సేవాసంస్థ ప్రతినిధులతో కలిసి విద్యార్థులకు వస్తువులను అందించారు.
గ్రామ పంచాయతీ పరిధిలో ప్రభుత్వ పాఠశాల అభివృద్ధి కోసం సర్పంచ్ చేస్తున్న కృషిని గ్రామస్తులు,విద్యార్థుల తల్లిదండ్రులు ప్రత్యేకంగా మెచ్చుకున్నారు.సర్పంచ్ కవిత-సుదర్శన్ రెడ్డి ఈ సందర్భంగా మాట్లాడుతూ..గాలివారిగూడెం ప్రభుత్వ పాఠశాల విద్యార్థిని,విద్యార్థుల ఆరోగ్యాలను దృష్టిలో ఉంచుకొని స్వచ్ఛమైన తాగునీరు,నాణ్యమైన చదువు అందించడమే మొదటి బాధ్యతగా గుర్తించిన సర్పంచి క్రివి సేవాసంస్థను కోరగా,వారు వెంటనే స్పందించి వాటర్ ఫిల్టర్,స్టేషనరితో పాటుగా విద్యార్థులకు స్కూల్ బ్యాగులు ఇవ్వడం సంతోషంగా ఉందని అన్నారు.క్రివి సేవా సంస్థ వారికి విద్యార్థుల తరుపున,గ్రామ పంచాయితీ తరుపున కృతజ్ఞతలు తెలియచేశారు.కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు అనంతరావు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి మండల విద్యాధికారి అనితాదేవి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.క్రివి సేవాసంస్థ ప్రతినిధి భానోత్ వెంకన్న,ఉపాధ్యాయులు మల్లికార్జున్,టి.సావిత్రి,జి.వి.నవ్యశ్రీ,బండి ఎల్లయ్య,విద్యార్థుల తల్లిదండ్రులు హాజరయ్యారు.
అనంతరం మండల విద్యాధికారి అనితాదేవి మాట్లాడుతూ..సర్పంచ్ కవిత-సుదర్శన్ రెడ్డి గ్రామాన్ని అభివృద్ధి చేస్తున్న తీరును చూసే ఈరోజు గాలివారిగూడెం స్కూలుకి,స్కూలు అభివృద్ధి కొరకు వారు సహాయం అందించారని,అన్ని గ్రామాల సర్పంచులు కవిత నారెడ్డిని చూసి మీ మీ గ్రామాలను అభివృద్ధి చేసుకోవాలని,మిగతా గ్రామాల ప్రజా ప్రతినిధులు ముందుకు వస్తే ప్రభుత్వ పాఠశాలలు ఇలా బలపడతాయని కొనియాడారు.క్రివి సేవాసంస్థ ప్రతినిధి భానోత్ వెంకన్న మాట్లాడుతూ,సర్పంచ్ కవిత-సుదర్శన్ రెడ్డి,గ్రామాన్ని అభివృద్ధిని చేస్తున్న తీరును చూసి,తమ గ్రామ పాఠశాల కోసం సర్పంచి చేసిన విజ్ఞప్తికి స్పందించి ఈ సహాయం మా సంస్థ తరుపున అందించామని తెలిపారు.సర్పంచ్ కవిత-సుదర్శన్ రెడ్డి పట్టుదల వల్లే పాఠశాలలో మంచినీటి ఇబ్బంది తీరిందని,విద్యార్థులకు అవసరమైన వస్తువులు అందాయని ప్రధానోపాధ్యాయులు అనంతరావు సర్పంచికి కృతజ్ఞతలు తెలిపారు...


