Type Here to Get Search Results !

న్యాయస్థానం తీర్పును వ్యతిరేకించి దౌర్జన్యంగా భూమిని లాక్కునే ప్రయత్నం.

  • న్యాయస్థానం తీర్పును వ్యతిరేకించి దౌర్జన్యంగా భూమిని లాక్కునే ప్రయత్నం 
  • తండ్రి విక్రయించిన భూమిని   లాక్కునేందుకు కొడుకుల ప్రయత్నం.
  • రిటైర్డ్ విఆర్ఓ పై భౌతిక దాడులు. 
  • న్యాయస్థానం పై నాకు పూర్తి నమ్మకం ఉంది అంటున్న వనవాసం కృష్ణారెడ్డి.




తిరుమలాయపాలెం, జాన్ 24 (నమస్తే న్యూస్)మహమ్మదాపురం రెవిన్యూ పరిధిలోని సర్వేనెంబర్ 105 /ఉ సుమారు 30 గంటల భూమిని 1998 లో సుమారు 30 సంవత్సరాల క్రితం ఇస్లావత్ వస్రారాం వద్ద 30 గుంటల భూమిని సుబ్లేడ్ గ్రామానికి చెందిన రిటైర్ వీఆర్వో వనవాసం కృష్ణారెడ్డి కొనుగోలు చేశాడు భూమి హక్కు పాసుబుక్ కూడా పొందాడు. ఇట్టి క్రమం లో ఇస్లావత్ వస్రరాం మృతి చెందిన తర్వాత అతని కుమారులు తండ్రి విక్రయించిన భూమి మాకే చెందుతుంది అంటూ దౌర్జన్యంగా బెదిరిస్తూ భౌతిక దాడులకు పాల్పడుతున్నారని బాధితుడు వనవాసం కృష్ణారెడ్డి ఆందోళన చెందుతూ పోలీస్ స్టేషన్ ను ఆశ్రయించగా వారు కోర్టులో తెలుసుకోవాలని చెప్పగా కోర్టుని కృష్ణారెడ్డి 2014లో నేను కొనుగోలు చేసిన భూమి పై నాకే హక్కు ఉంటుందని కోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు‌. ఇట్టి క్రమంలో 2022లో సుమారు 8 సంవత్సరాల తర్వాత న్యాయస్థానం కొనుగోలు చేసి పట్టా పొందిన వనవాసం కృష్ణారెడ్డికే అట్టి భూమి  చెందుతుందని తుది తీర్పు వెల్లడించింది ఈ తీర్పును సవాలు చేస్తూ వస్రారాం కుమారులు జిల్లా కోర్టుని ఆశ్రయించగా జిల్లా కోర్టు సైతం 2026 ఏప్రిల్ లో పట్టా పొందిన వనవాసం కృష్ణారెడ్డికే ఆ భూమి చెందుతుందని తీర్పు ఇవ్వడం తో చేసేదేమీ లేక ఆ స్థలంలో ఉన్న ఫినిషింగ్ రాళ్లను తొలగిస్తూ భౌతిక దాడులకు పాల్పడుతున్నారని అట్టి వారిపై పోలీసు అధికారులు కఠిన చర్యలు తీసుకొని నేను కొనుగోలు చేసిన భూమిని నాకు చెందే విధంగా చూడాలని వనవాసం కృష్ణారెడ్డి వేడుకుంటున్నాడు. భారతీయ న్యాయ చట్టాలపై న్యాయస్థానంపై పూర్తి నమ్మకం నాకు ఉందని ఆయన తెలిపారు.

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.