చిన్నారి పుట్టినరోజు వేడుక కు హాజరైన మాజీ మంత్రి డీఎస్.రెడ్యా నాయక్.
డోర్నకల్/మరిపెడ(జూన్ 5)నమస్తే న్యూస్:మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ మండల కేంద్రంలో గురువారం సందడి వాతావరణం నెలకొంది.మాజీ మహబూబాబాద్ మార్కెట్ కమిటీ చైర్మన్ కత్తెరసాల విద్యాసాగర్ మనవరాలు చిరంజీవి మంగళగిరి యశశ్రీ పుట్టినరోజు వేడుకను కుటుంబ సభ్యులు అంగరంగ వైభవంగా నిర్వహించారు.ఈ వేడుకకు డోర్నకల్ మాజీ మంత్రి డీఎస్ రెడ్యానాయక్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.చిన్నారి యశశ్రీని ఆప్యాయంగా దీవించి,నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో,ఉన్నత చదువులతో ఎదగాలని ఆకాంక్షించారు.అనంతరం కేక్ కట్ చేయించి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు.ఈ కార్యక్రమంలో కత్తెరసాల విద్యాసాగర్ కుటుంబ సభ్యులు,బంధుమిత్రులు,స్థానిక ప్రజాప్రతినిధులు,ముఖ్య నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొని చిన్నారిని ఆశీర్వదించారు.

