ఇందిరా మహిళా శక్తి విజయోత్సవ సదస్సుకు కదిలిన మహిళా సంఘాలు
నర్సింహులపేట, జూన్ 9 (నమస్తే న్యూస్)
రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో సికింద్రాబాద్‌లోని పెరేడ్ గ్రౌండ్స్‌లో నిర్వహిస్తున్న ఇందిరా మహిళా శక్తి విజయోత్సవ సదస్సుకు మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేట మండలానికి చెందిన మహిళా సంఘాల సభ్యులు భారీ సంఖ్యలో మంగళవారం తరలివెళ్లారు. మండల కేంద్రం నుంచి ప్రత్యేక బస్సుల ద్వారా మహిళలను సదస్సుకు పంపించారు.ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో మండల తహసీల్దార్ రమేష్ బాబు, ఎస్సై బానోతు వెంకన్న, గ్రామ సర్పంచ్ పెదమాముల యాకయ్య, ఏపీఎం రాములు నాయక్ సంయుక్తంగా జెండా ఊపి ప్రత్యేక బస్సును ప్రారంభించారు.అనంతరం వారు మాట్లాడుతూ, మహిళల సాధికారతకు రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని తెలిపారు. మహిళల ఆర్థిక, సామాజిక అభివృద్ధిని లక్ష్యంగా చేసుకుని అనేక సంక్షేమ, స్వయం ఉపాధి కార్యక్రమాలు అమలు చేస్తున్నట్లు పేర్కొన్నారు. మహిళా సంఘాల సభ్యులు ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకుని ఆర్థిక స్వావలంబన సాధించే దిశగా అడుగులు వేయాలని సూచించారు.ఇందిరా మహిళా శక్తి విజయోత్సవ సదస్సులో పాల్గొనేందుకు మహిళలు ఉత్సాహంగా తరలివెళ్లడం విశేషంగా నిలిచింది. కార్యక్రమంలో మహిళా సంఘాల ప్రతినిధులు, గ్రామ నాయకులు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. సదస్సు ద్వారా మహిళలకు అందుబాటులో ఉన్న ప్రభుత్వ పథకాలు, ఉపాధి అవకాశాలు మరియు సాధికారత కార్యక్రమాలపై అవగాహన కల్పించనున్నట్లు అధికారులు తెలిపారు.


