భక్తిశ్రద్ధలతో ఘనంగా దుర్గమ్మ బోనాల పండుగ.
బోనాలతో మహిళల ఊరేగింపు.. యాటపోతుల సమర్పణ.
నర్సింహులపేట, మే 26(నమస్తే న్యూస్)
మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేట మండల పరిధిలోని వస్రాం తండాలో మంగళవారం దుర్గమ్మ పండుగ వేడుకలు భక్తిశ్రద్ధల మధ్య ఘనంగా నిర్వహించారు.ఏటా సాంప్రదాయబద్ధంగా నిర్వహించే ఈ వేడుకల్లో తండా ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.ఉదయం మహిళలు ఇళ్లను, ముంగిళ్లను అలంకరించి భక్తిశ్రద్ధలతో బోనాలను తయారు చేశారు. అనంతరం తలలపై బోనాలతోమంగళవాయిద్యాలు,పోతురాజుల విన్యాసాల నడుమ ఊరేగింపుగా దుర్గమ్మ ఆలయానికి చేరుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. తండా ప్రజలకు కష్టాలు దూరమై, పంటలు బాగా పండాలని అమ్మవారిని ప్రార్థించారు.ఈ సందర్భంగా భక్తులు యాటపోతులను సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు.వేడుకల్లో స్థానిక సర్పంచ్ లూనావత్ జ్యోతి వాసు నాయక్, మాజీ ఎంపీటీసీ సీతారామ్ నాయక్, మాజీ సర్పంచ్ సీతారామ్ నాయక్ పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు.ఈ సందర్భంగా సర్పంచ్ జ్యోతి వాసు నాయక్ మాట్లాడుతూ దుర్గమ్మ పండుగ తండా సంస్కృతి, సాంప్రదాయాలకు ప్రతీకగా నిలుస్తోందని, ప్రజలంతా ఐక్యంగా జరుపుకోవడం ఆనందంగా ఉందన్నారు. దుర్గమ్మ తల్లి ఆశీస్సులు తండా ప్రజలందరిపై ఉండాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో తండా పెద్దలు, యువకులు, మహిళలు, గ్రామస్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలు, అన్నదానం నిర్వహించారు.

