కొనుగోలు కేంద్రాలలో జరుగుతున్న దోపిడీ అరికట్టాలి: బీజేపీ మండల అధ్యక్షుడు సూరబోయిన సతీష్.
రెవిన్యూ అధికారులకు వినతి పత్రం అందజేసిన బీజేపీ నాయకులు.
నర్సింహులపేట, 20 మే ( నమస్తే న్యూస్)
ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లో తరుగు,తేమ పేరుతో రైతులను నిలువు దోపిడీ చేస్తున్నారని,వాటిని అరికట్టి రైతులకు సరైన న్యాయం చేయాలని నర్సింహులపేట బీజేపీ మండల పార్టీ అధ్యక్షుడు సూరబోయిన సతీష్ డిమాండ్ చేశారు.బుధవారం మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేట మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయంలో ఆర్‌ఐ అఖిల్‌కు వినతి పత్రాన్ని అందజేశారు.అనంతరం ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కొనుగోలు కేంద్రాల్లో జాప్యం లేకుండా కాంటా పూర్తైన వెంటనే ధాన్యాన్ని తరలించాలని, రైతులకు తాగునీరు, నీడ వంటి కనీస సౌకర్యాలు కల్పించాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ కార్యక్రమంలో భాజపా నాయకులు కార్యకర్తలు యువ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

