Type Here to Get Search Results !

అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ ఫలాలు అందించడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం:ఎమ్మెల్యే డా.రామచంద్రు నాయక్.

ఆడపడుచులకు అండగా కల్యాణ లక్ష్మి,షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ.

       కల్యాణలక్ష్మి చెక్కులు పంపిణీ చేస్తున్న ఎమ్మెల్యే డాక్టర్  రామచంద్రనాయక్.

నర్సింహులపేట,20 మే(నమస్తే న్యూస్)

నిరుపేద కుటుంబాలకు కళ్యాణ లక్ష్మి పథకం కొండంత అండగా నిలుస్తోందని, అర్హులైన ప్రతి ఒక్కరికి కాంగ్రెస్ ప్రభుత్వ సంక్షేమ ఫలాలు అందించడమే మా లక్ష్యం అని డోర్నకల్ నియోజకవర్గం ఎమ్మెల్యే డాక్టర్ రామచంద్రనాయక్ అన్నారు.బుధవారం మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేట మండల కేంద్రంలోని రైతు వేదిక కార్యాలయంలో మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన 60 మంది లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను ఎమ్మెల్యే డాక్టర్ రామచంద్రనాయక్ పంపిణీ చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో ఆడపడుచులకు అండగా కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాలను సమర్థవంతంగా అమలు చేస్తున్నామని తెలిపారు.అర్హులైన ప్రతి కుటుంబానికి రెండో విడతగా ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి అవకాశం కల్పిస్తూ ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రజలకు చేరేలా కృషి చేస్తున్నామని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో తాసిల్దార్ రమేష్ బాబు, ఏవో వినయ్ కుమార్, కాంగ్రెస్ జిల్లా ప్రధాన కార్యదర్శి దాసరోజు రాజశేఖర్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు జినుకల రమేష్,   నర్సింహులపేట గ్రామ సర్పంచ్ పెద్దమాముల యాకయ్య, ఉప సర్పంచ్ కాస యాకయ్య, పడమటిగూడెం గ్రామ సర్పంచ్ ఉప్పలయ్య, దేవాలయం చైర్మన్ విజయ్ పాల్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ నాయకులు లింగారెడ్డి, తదితరులు పాల్గొన్నారు. 




Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.