పిడుగుపాటుతో రెండు మేకలు మృతి.
నర్సింహులపేట, మే 03 (నమస్తే న్యూస్)
వడగండ్లతో కూడిన అకాల వర్షానికి పిడుగు పడి రెండు పశువులు మృత్యువాత పడిన ఘటన నర్సింహులపేట మండలం కౌసల్యాదేవిపల్లి గ్రామంలో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన గొర్రెల కాపరి ఏర్పుల వెంకన్నకు చెందిన రెండు మేకలు పిడుగుపాటుకు గురై మృతి చెందినట్లు సమాచారం. అకస్మాత్తుగా కురిసిన అకాల వర్షం, మెరుపులతో కూడిన గాలివాన సమయంలో ఈ ఘటన జరిగింది.ఈ ఘటనతో రైతుకు 30 వేల రూపాయలు నష్టం వాటిల్లగా, ఆవేదన వ్యక్తం చేస్తూ ప్రభుత్వం తమను ఆదుకోవాలని కోరుతున్నారు.

