వీవో భవన నిర్మాణానికి భూమి పూజ.
నర్సింహులపేట, 25 మే (నమస్తే న్యూస్)
వంతడపల గ్రామ అభివృద్ధిలో మరో ముందడుగు మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేట మండలం వంతడపల గ్రామంలో సోమవారం వెలుగు ఆఫీస్ (వీవో) నిర్మాణానికి గ్రామ సర్పంచ్ మాలోతు బాలునాయక్ కొబ్బరికాయ కొట్టి భూమిపూజ నిర్వహించారు.ఈ సందర్భంగా సర్పంచ్ బాలు నాయక్ మాట్లాడుతూ, మన గ్రామం – మన అభివృద్ధి అనే సంకల్పంతో వంతడపల గ్రామాన్ని అభివృద్ధి దిశగా ముందుకు తీసుకెళ్తున్నామని తెలిపారు. గ్రామ ప్రజలకు అవసరమైన మౌలిక సదుపాయాలను కల్పించేందుకు ప్రభుత్వం సహకారంతో పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నామని పేర్కొన్నారు.గ్రామ అభివృద్ధికి ప్రతి ఒక్కరి సహకారం అవసరమని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ పంచాయతీ కార్యదర్శి ఉమారాణి, సి సి రమణమ్మ, సి ఏ శశిరేఖ,వివో అధ్యక్షురాలు అలువాల రేణుక, సుజాత, వెంకటలక్ష్మి, వార్డు సభ్యులు లింగమ్మ గ్రామ పెద్దలు బోళ్ల సంజీవరెడ్డి, పోలోజు శ్రీనివాస చారి, గ్రామ ప్రజలు, నాయకులు, మహిళా సంఘ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.


