- బలమైన భవిష్యత్తుకు తల్లిపాలే పునాది.
- మరిపెడలో ఘనంగా తల్లిపాల వారోత్సవాలు.
కారంపురి వెంకటేశ్వర్లు నేత. 7893556455.
డోర్నకల్/మరిపెడ,ఆగస్టు 04(నమస్తే న్యూస్).
బలమైన భవిష్యత్తుకు తల్లిపాలే పునాది లాంటిది అని మరిపెడ ఐసిడిఎస్ ప్రాజెక్టు ఏసీడీపీఓ తేజ కళ్యాణి,పట్టణ 14వ వార్డు కౌన్సిలర్ జాటోతు సురేష్ అన్నారు. మంగళవారం మరిపెడ మున్సిపాలిటీ కేంద్రంలో ప్రపంచ తల్లిపాల వారోత్సవాలను ఘనంగా నిర్వహించారు. సేవా నగర్, బ్యాంక్ కాలనీ,రాము తండా, గ్యామాతండ, హౌసింగ్ బోర్డు, మైనార్టీ కాలనీలలోని అంగన్వాడీ కేంద్రాలలో ఈ కార్యక్రమాలు సంయుక్తంగా జరిగాయి.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన తేజ కళ్యాణి,వార్డు కౌన్సిలర్ సురేష్ చిన్నారులకు అన్నప్రసన్న,అక్షరాభ్యాస కార్యక్రమాలను నిర్వహించారు.అనంతరం గర్భిణీలు,బాలింతలకు తల్లిపాల ప్రాముఖ్యతపై అవగాహన కల్పించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ,ప్రతి తల్లి తన బిడ్డకు జన్మనిచ్చిన గంటలోపే తల్లి పాలు అందించాలన్నారు.తల్లిపాలు శిశువుకు అమృతం వంటివని,వాటిలో అత్యుత్తమ పోషక విలువలు ఉంటాయని తెలిపారు.పిల్లలు ఆరోగ్యంగా,బలంగా ఎదగడానికి తల్లిపాలే ఉత్తమ పోషకాహారమని పేర్కొన్నారు. పుట్టిన బిడ్డకు కనీసం ఆరు నెలల వరకు తల్లిపాలు మాత్రమే ఇవ్వాలని సూచించారు.తల్లిపాలు పొందడం ప్రతి శిశువు హక్కు అని, ప్రతి తల్లి తన మాతృత్వ బాధ్యతను గుర్తించి పిల్లలకు తల్లిపాలు అందించాలని కోరారు. ఆరోగ్యకరమైన సమాజ నిర్మాణానికి తల్లిపాలు ఎంతో కీలకమని వారు అన్నారు.ఈ కార్యక్రమంలో ఐసిడిఎస్ సూపర్వైజర్ వి.రాజ్యలక్ష్మి,అంగన్వాడీ టీచర్లు విజయలక్ష్మి, కే.శ్రీమతి, రజిని, ఉమారాణి, శారద ,అలీమా ,హెల్పర్ సునీత,గర్భిణీలు,బాలింతలు తదితరులు పాల్గొన్నారు…


