7వ వార్డులో అభివృద్ధి పనుల పరిశీలన.
మరిపెడ,ఆగస్టు 11(నమస్తే న్యూస్).
మరిపెడ పట్టణంలో పార్టీని బలోపేతం చేసే దిశగా కాంగ్రెస్ పార్టీ పట్టణ వార్డు కమిటీల నిర్మాణానికి సంబంధించి ముఖ్య నాయకుల సన్నాహక సమావేశం మంగళవారం జరిగింది.ఈ సమావేశానికి మున్సిపల్ చైర్ పర్సన్ వీసారపు ప్రగతి శ్రీపాల్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై దిశా నిర్దేశం చేశారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రాబోయే రోజుల్లో ప్రతి వార్డులో పార్టీ కమిటీలను బాధ్యతాయుతంగా ఏర్పాటు చేసి,ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు.ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రతి ఇంటికి చేరవేయడంలో కార్యకర్తలు చురుగ్గా పనిచేయాలని సూచించారు. సమావేశం అనంతరం మున్సిపల్ చైర్ పర్సన్ వీసారపు ప్రగతి శ్రీపాల్ రెడ్డి మరిపెడ పట్టణంలోని 7వ వార్డు పరిధిలోని శ్రీ రామ విలాస్ కాలనీలో కొనసాగుతున్న రోడ్డు నిర్మాణ పనులను స్వయంగా పరిశీలించారు.పనుల నాణ్యత,వేగంపై అధికారులను అడిగి తెలుసుకున్నారు.నిర్ణీత గడువులోగా పనులను పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని సూచించారు.ప్రజలకు మెరుగైన సౌకర్యాలు కల్పించడమే లక్ష్యంగా ప్రభుత్వం,పార్టీ కలిసి పనిచేస్తున్నాయని,అభివృద్ధి,సంక్షేమ కార్యక్రమాలను మరింత ముందుకు తీసుకెళ్తామని నాయకులు తెలిపారు.కార్యక్రమాల్లో.వీసారపు ప్రగతి శ్రీపాల్ రెడ్డి, గుగులోత్ రవి నాయక్, పానుగోతు రాంలాల్, కాలం రవీందర్ రెడ్డి,మెరుగు రాము, జాటోతు సురేష్, తిరుపతి, నీలా లచ్చిరామ్, జియో రమేష్, పానుగోతు రాములు, గుండగాని వెంకన్న, షేక్ అజీజ్ పాషా, గంధసిరి అంబరీష్, మహ్మద్ అప్సర్, కుడితి నరసింహ రెడ్డి,పడిదం రాధిక,అలువాల ఉపేందర్ ప్రజాపతి,గంధసిరి బిక్షపతి,బోడ రవి,చీనా నాయక్,సాయి,కరణ్ సింగ్,బంక ప్రమోద్,కారంపూడి ఉపేందర్, జానీ పాషా, గుంటి రవి, లింగన్న, గంధసిరి సోమన్న, భాషిపంగు, రవికాంత్, మహేందర్, లచ్చిరామ్ తదితరులు పాల్గొన్నారు.



