రిపోర్టర్:దామల్ల భాస్కర్
తిరుమలాయపాలెం ఆగస్టు 11 (నమస్తే న్యూస్ )
ఆదర్శ ఉపాధ్యాయురాలు నిమ్మ తోట ఇందిరాను సన్మానించిన సిపిఎం మండల కమిటీ తిరుమలయపాలెం మండలం గోపాలపురం కి చెందిన ఇందిరా టీచర్ పనిచేస్తూ గత కొన్ని సంవత్సరాలుగా స్కూల్ బిల్డింగు శిథిలావస్థకు చేరింది అస్తవ్యస్తంగా ఉన్న పాఠశాల విషయంపై స్థానికులు ప్రజా సంఘాలు పార్టీలు నూతన బిల్డింగ్ మంజూరు చేయాలని ఎన్నో సార్లు విజ్ఞప్తి చేయడం జరిగింది కానీ బిల్డింగ్ నిధులు ప్రభుత్వం మంజూరు చేయకపోవడంతో టీచర్ ఇందిరా తన సొంత డబ్బులతో రేకులు షెడ్డు వేసి నే స్కూల్ గా మార్చుకొని పాఠాలు చెప్పిన ఫలితంగా విద్యార్థుల సంఖ్య కూడా పెరిగింది దీనికి స్పందించిన ముఖ్యమంత్రి 30 లక్షల రూపాయలు స్కూలు నూతన బిల్లింగ్ మంజూరు చేయటం పట్ల సిపిఎం మండల కమిటీ ఇందిరా టీచర్ ను అభినందిస్తూ శాల తో సత్కరించి అభినందనలు తెలియజేశారు తిరుమలాయపాలెం మండలంలో సమస్యలు పరిష్కారం కోసం ప్రభుత్వం చొరవ చూపాలని మండలంలో నాలుగు స్కూల్స్ పైగా మూసి వేయడం జరిగిందని అజ్మీర తండాలో విద్యార్థులు ఉన్నప్పటికీ స్కూలు మూసి వేయడం దారుణం అని వెంటనే స్కూల్ తెరిపించాలని మండలంలో డిప్యూటేషన్ పైన వెళ్లిన ఉపాధ్యాయులను వెనక్కి పిలిపించి మూసివేసిన స్కూల్స్ ను తెరిపించే విధంగా చర్యలు తీసుకోవాలని సిపిఎం మండల కార్యదర్శి కొమ్ము శ్రీను డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో తుళ్లూరి నాగేశ్వరరావు కామల్ల సునీల్ నాగేశ్వరరావు బి రాజేష్ పాల్గొన్నాడు.

