సమిష్టిగా ఉండి సమస్యలపై పోరాడాలి.
జర్నలిస్టులకు ఇండ్ల స్థలాలు, ఇండ్లు సాధించాలి.
జర్నలిస్టుల హక్కుల సాధన కోసం ఉద్యమించాలి.
గూడూరు, ఆగస్టు 11 (నమస్తే న్యూస్):
జర్నలిస్టుల హక్కుల సాధన కోసం ఉద్యమించాలని, సమిష్టిగా ఉండి సమస్యలపై పోరాడి జర్నలిస్టులకు ఇండ్ల స్థలాలు, ఇండ్లు సాధించుకోవాలని టీయూడబ్ల్యూజె (ఐజేయు) మహబూబాబాద్ జిల్లా అధ్యక్షుడు చిత్తనూరి శ్రీనివాస్ పిలుపునిచ్చారు. జర్నలిస్టుల సంక్షేమమే యూనియన్ ప్రధాన లక్ష్యమని ఆయన అన్నారు.గూడూరు మండలం వట్టెవాగు సమ్మక్క–సారలమ్మ వనదేవతల ప్రాంగణంలో మంగళవారం టీయూడబ్ల్యూజె (ఐజేయు) మండల కమిటీ సమావేశం, సభ్యత్వ నమోదు కార్యక్రమం మండల అధ్యక్షుడు గుర్రపు యాకాంబ్రం అధ్యక్షతన నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా అధ్యక్షుడు చిత్తనూరి శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు.తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమంలో జర్నలిస్టులు కీలక పాత్ర పోషించారని శ్రీనివాస్ అన్నారు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత కూడా జర్నలిస్టుల జీవితాల్లో ఆశించిన స్థాయిలో మార్పు రాలేదని పేర్కొన్నారు. జీతభత్యాలు లేకపోయినా 24 గంటలు నిద్రాహారాలు మాని ప్రజలకు, ప్రభుత్వానికి వారధిగా జర్నలిస్టులు పనిచేస్తున్నారని తెలిపారు.జర్నలిస్టులు ఆర్థికంగా అభివృద్ధి చెందకపోవడంతో పాటు ఆరోగ్య భద్రత లేక అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. విధి నిర్వహణలో మృతి చెందిన జర్నలిస్టుల కుటుంబాలను మీడియా అకాడమీ ద్వారా ఆదుకుంటున్నామని, మృతిచెందిన జర్నలిస్టు భార్యకు రూ.3 వేల పెన్షన్ అందిస్తున్నట్లు తెలిపారు. అక్రిడిటేషన్ కలిగిన ప్రతి జర్నలిస్టుకు హెల్త్ కార్డు అందేలా కృషి చేస్తామని చెప్పారు.అర్హులైన జర్నలిస్టులకు నివాస స్థలాలు కేటాయించేందుకు ప్రభుత్వం ప్రత్యేక పాలసీ ప్రకటించాలని, ఇండ్ల స్థలాలు కేటాయించడంతో పాటు ఇళ్లు నిర్మించి ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. జర్నలిస్టుల సమస్యల పరిష్కారం కోసం అందరూ సమిష్టిగా పోరాడాల్సిన సమయం ఆసన్నమైందన్నారు.జర్నలిస్టుల హక్కులు సాధించే వరకు టీయూడబ్ల్యూజె (ఐజేయు) ఆధ్వర్యంలో పోరాటాలు కొనసాగిస్తామని శ్రీనివాస్ తెలిపారు. యూనియన్ సభ్యులంతా సమన్వయంతో, ఐక్యతతో పనిచేయాలని, సంఘ నియమ నిబంధనలకు లోబడి బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సూచించారు. స్థానిక జర్నలిస్టుల సమస్యలపై దృష్టి సారించి వాటి పరిష్కారానికి కృషి చేయాలని కోరారు. సమన్వయంతో పనిచేసి యూనియన్ను మరింత బలోపేతం చేయాలని పిలుపునిచ్చారు.ఈ సమావేశంలో టీయూడబ్ల్యూజె (ఐజేయు) జిల్లా ప్రధాన కార్యదర్శి గాడిపెల్లి శ్రీహరి, మండల అధ్యక్షుడు గుర్రపు యాకాంబ్రం, రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు గంధసిరి రవి, ట్రైబల్ వర్కింగ్ జర్నలిస్ట్ అసోసియేషన్ (టీడబ్ల్యూజేఏ) జిల్లా అధ్యక్షుడు బానోత్ లక్ష్మణ్ నాయక్, టీయూడబ్ల్యూజె (ఐజేయు) జిల్లా ఉపాధ్యక్షులు ఉమగాని మధు, ముక్తవరం సత్యనారాయణ, కోరే పాపయ్య, ఎలక్ట్రానిక్ మీడియా జిల్లా ప్రధాన కార్యదర్శి ఉప్పల రంగ, జిల్లా సహాయ కార్యదర్శి రావూరి ప్రశాంత్, జిల్లా కమిటీ సభ్యులు పానుగంటి శ్రీనివాస్, కురవి మండల అధ్యక్షుడు గుంటి సురేష్, మండల కమిటీ నాయకులు కుందూరు కరుణాకర్ రెడ్డి, కన్నా వెంకటేశ్వర్లు, బూరుగు నవనీత్, బానోతు నరసింహ, భూక్య నరసింహ, రాకేష్, భీమగాని యాదగిరి, సంతోష్, బోడ రాజు, మంతపురపు యాకయ్య, యాకుబ్ పాషా, గందసరి రవీందర్, ఎల్లంకి వెంకటేష్, పానుగంటి అజయ్, భూక్య మోహన్, చాగంటి భీముడు, రాజేందర్, రాయపురం సంపత్, బిక్షపతి, భరత్, శ్రీనివాస్, సురేష్, ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.


