
మరిపెడ,ఆగస్టు 10(నమస్తే న్యూస్).మహబూబాబాద్ జిల్లా కురవి మండలం కందికొండ గ్రామ కాంగ్రెస్ పార్టీ నూతన అధ్యక్షుడిగా షేక్ పాషా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.ఉపాధ్యక్షుడిగా బత్తుల వీరన్నను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.కందికొండ గ్రామ సర్పంచ్ తొడ్సు నాగార్జున ఆధ్వర్యంలో,కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు ఉమ మురళి నాయక్ ఆదేశాల మేరకు సోమవారం గ్రామ కాంగ్రెస్ పార్టీ నాయకులు,కార్యకర్తలు సమావేశమై నూతన కమిటీని ఎన్నుకున్నారు.ఈ సందర్భంగా పార్టీ నాయకులు మాట్లాడుతూ గ్రామస్థాయిలో కాంగ్రెస్ పార్టీని మరింత బలోపేతం చేసేందుకు నూతన అధ్యక్షుడు,ఉపాధ్యక్షుడు సమన్వయంతో పనిచేయాలని ఆకాంక్షించారు.పార్టీ సిద్ధాంతాలు,ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంతో పాటు గ్రామంలోని ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని సూచించారు.నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన షేక్ పాషా మాట్లాడుతూ తనపై నమ్మకం ఉంచి పార్టీ బాధ్యతలను అప్పగించిన కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు ఉమ మురళి నాయక్,గ్రామ సర్పంచ్ తొడ్సు నాగార్జున,పార్టీ నాయకులు,కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలిపారు.గ్రామస్థాయిలో పార్టీని మరింత బలోపేతం చేసేందుకు శక్తివంచన లేకుండా కృషి చేస్తానని చెప్పారు.పార్టీ నాయకులు,కార్యకర్తలను సమన్వయం చేసుకుంటూ కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్తానని తెలిపారు.షేక్ పాషా,బత్తుల వీరన్న ఏకగ్రీవ ఎన్నిక పట్ల కాంగ్రెస్ నాయకులు,కార్యకర్తలు హర్షం వ్యక్తం చేశారు. నూతనంగా ఎన్నికైన వారిని అభినందించి పార్టీ బలోపేతానికి కృషి చేయాలని ఆకాంక్షించారు.
