మరిపెడ,ఆగస్టు 10 (నమస్తే న్యూస్).
కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాల ప్రజావ్యతిరేక విధానాలను నిరసిస్తూ ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఆదివారం మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండల కేంద్రంలో భారీ ర్యాలీ,రాస్తారోకో నిర్వహించారు.ర్యాలీలో పాల్గొన్న వ్యకాసా జిల్లా ప్రధాన కార్యదర్శి అల్వాల వీరయ్య,సిఐటియు నాయకులు,ఏఐకేఎస్ నాయకులు,నాయకులు గుండగాని మధుసూదన్,కెవిపిఎస్ జిల్లా నాయకులు జిన్న లచ్చన్నలు ఈ సందర్భంగా మాట్లాడుతూ,కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు కార్మిక,కర్షక వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్నాయని ధ్వజమెత్తారు.దేశ సంపదను కార్పొరేట్ సంస్థలకు ధారాదత్తం చేస్తున్నారని విమర్శించారు.వారు ప్రభుత్వానికి చేసిన డిమాండ్లు:కార్మికులకు కనీస వేతనం: దేశంలో పనిచేస్తున్న కార్మికులకు భారత రాజ్యాంగం ప్రకారం నెలకు.26,000 రూపాయల కనీస వేతనం ఇవ్వాలి.ఉద్యోగ గుర్తింపు: అనేక రాష్ట్రాల్లో ఉన్నట్లు వర్కర్లను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి ఈఎస్ఐ,పీఎఫ్ లు,అలాగే కనీస వేతనం వర్తింప చేయాలి అన్నారు.మౌలిక సదుపాయాలు: మున్సిపాలిటీ,గ్రామపంచాయతీల్లో పనిచేస్తున్న కార్మికులకు కనీస మౌలిక సదుపాయాలు కల్పించాలి. విద్యా రంగం: తెలంగాణలోని ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు,ఉపాధ్యాయుల కొరతను తీర్చాలి.ప్రతి పాఠశాలకు తరగతి గదులు,అటెండర్లను తక్షణమే ఏర్పాటు చేయాలి.ఉన్నత విద్య: రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ ప్రభుత్వ విద్యాలయాల్లో మౌలిక సదుపాయాలు కల్పించాలి.రాష్ట ప్రభుత్వం హామీల అమలు చేయాలి: రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన 6 గ్యారంటీలను తక్షణమే అమలు చేయాలి.ఇటీవల ప్రజా సంఘాల ఆధ్వర్యంలో గ్రామాల్లో చేసిన సర్వేలో అనేక స్థానిక సమస్యలు వెలుగులోకి వచ్చాయని,స్థానిక మండల,మున్సిపాలిటీ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు.గ్రామ పంచాయతీలకు నిధులు కేటాయించాలనే ఉద్దేశంతోనే ఈ జైలు భరో కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున నిర్వహించినట్లు తెలిపారు.ప్రభుత్వాలు ఇప్పటికైనా సమస్యలు పరిష్కరించకుంటే దశలవారీగా ఉద్యమం చేసి,సమస్యలు పరిష్కారమయ్యే వరకు పోరాడుతామని నాయకులు హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో అంగన్వాడి వర్కర్ల జిల్లా అధ్యక్షురాలు బెస్త సంపూర్ణ,కుమ్మరి కుంట్ల జ్యోతి,సిఐటియు నాయకులు నందిపాటి వెంకన్న,సిఐటియు మండల బిల్డింగ్ వర్కర్స్ యూనియన్ కన్వీనర్ కొండ ఉప్పలయ్య,ఆశ వర్కర్ల యూనియన్ నాయకులు వడ్లకొండ ఉపేంద్ర,వాడపల్లి సుజాత,తాళ్ల శైలజ,రైతు సంఘం నాయకులు అల్లి శ్రీనివాస్ రెడ్డి,నలబోలు లక్ష్మారెడ్డి,కేజికేఎస్ నాయకులు గంధసిరి మహేష్,వ్యకాసా తూము విజయ్,సీత వెంకన్న,పోలేపాక గణేష్,వీరంకులు తాడూరి,ఆవాజ్ సంఘ నాయకుడు ఎస్.కె. షరీఫ్,ఎస్.కె.ఇమామ్ సాబ్,షమీనా,బాబూజీ గూడెం నాయకుడు దిగజార్ల అంతయ్య,కెవిపిఎస్ నాయకులు బాణాల ఎల్లయ్య,వడ్లకొండ గంగరాజు తదితరులు పాల్గొన్నారు.


