రిపోర్టర్:దామల్ల భాస్కర్
తిరుమలాయపాలెం,ఆగస్టు 10 (నమస్తే న్యూస్ )
తిరుమలాయపాలెం మండలం గోపాలపురం గ్రామం లో ఉపాధ్యాయురాలుగా పని చేస్తూ అందరికీ ఆదర్శంగా నిలిచిన నిమ్మ తోట ఇందరకు బిఆర్ అంబేద్కర్ ప్రజా సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు లింగాల రవికుమార్ ఆధ్వర్యంలో వివిధ ప్రజా సంఘాల నేతలు శాలువాతో సత్కరించి అభినందన జ్ఞాపికను అందజేశారు ఈ సందర్భంగా సీనియర్ దళిత నాయకులు గుంతేటి వీరభద్రం హైకోర్టు న్యాయవాది పల్లా రాజశేఖర్ లింగాల రవికుమార్ పలువురు నాయకులు మాట్లాడుతూ గోపాలపురం ప్రాథమిక పాఠశాల భవనం శిథిలావస్థలో ఉండగా విద్యార్థుల విద్యా బోధన అసౌకర్యంగా ఉండటంతో అక్కడే ఉపాధ్యాయునిగా పనిచేస్తున్న నిమ్మ తోట ఇందిర తన సొంత ఖర్చులతో రేకుల షెడ్డు నిర్మించి విద్యార్థులకు విద్యాబోధన చేయడాన్ని గుర్తించిన ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి టీచర్ ఇందిర కు ఫోన్ చేసి అభినందించి పాఠశాల భవనానికి తక్షణమే 30 లక్షల రూపాయలు నిధులు మంజూరు చేసి నూతన భవనం నిర్మించాలని ఆదేశించడం అభినందనీయమని ఉపాధ్యాయురాలు ఇందిర చూపిన చొరవ ఇతరులకు స్ఫూర్తిదాయకమని అన్నారు ఈ కార్యక్రమంలో సీనియర్ జర్నలిస్ట్ మోటపోతుల బాబురావు వివిధ సంఘాల నేతలు ముడుసు జాకబ్ ప్రతాప్ దాసరి దానియేలు జంగం లక్ష్మణరావు దామల్ల సత్యం బిందె రమేష్ కరాటే వేణు దారా సందీప్ జ్యోతి మోహన్ రావు స్వరూప రాణి తదితరులు నిమ్మ తోట ఇందిర ను అభినందించారు.

