తిరుమలాయపాలెంలో విజయవంతంగా జైల్‌భరో కార్యక్రమం.
రిపోర్టర్: దామల్ల భాస్కర్
తిరుమలాయపాలెం, ఆగస్టు 10 (నమస్తే న్యూస్):
ప్రజా వ్యతిరేక పాలన కొనసాగిస్తున్న బీజేపీ ప్రభుత్వం గద్దె దిగే వరకు పోరాటాలు ఆగవని అఖిలపక్ష పార్టీల నాయకులు స్పష్టం చేశారు. అఖిలపక్ష పార్టీలు, కార్మిక, రైతు, వ్యవసాయ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో సోమవారం తిరుమలాయపాలెం మండల కేంద్రంలో నిర్వహించిన జైల్‌భరో కార్యక్రమం విజయవంతమైంది.ముందుగా గజ్జల వెంకటయ్య భవనం నుంచి పెట్రోల్ బంక్ సర్కిల్ వరకు భారీ ప్రదర్శన నిర్వహించారు. అనంతరం ఖమ్మం–వరంగల్ ప్రధాన రహదారిపై సుమారు రెండున్నర గంటలపాటు రాస్తారోకో చేపట్టారు.అనంతరం నిర్వహించిన సభకు సీపీఎం మండల కార్యదర్శి కొమ్ము శ్రీను అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్, బీఆర్ఎస్, సీపీఎం, సీపీఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ, సీపీఐ(ఎంఎల్) మాస్‌లైన్ తదితర పార్టీల నాయకులు మాట్లాడారు.బీజేపీ ప్రభుత్వం గత 12 సంవత్సరాలుగా ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తోందని నాయకులు ఆరోపించారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయకుండా మతోన్మాద రాజకీయాలతో ప్రజలను పక్కదారి పట్టిస్తోందని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ప్రజలను కదిలించడంలో భాగంగానే జైల్‌భరో కార్యక్రమాన్ని చేపట్టినట్లు తెలిపారు.క్విట్ ఇండియా ఉద్యమ స్ఫూర్తితో ఆగస్టు 10న దేశవ్యాప్తంగా చేపట్టిన ఈ కార్యక్రమంలో కార్మికులు, రైతులు, వ్యవసాయ కూలీలు, విద్యార్థులు, మేధావులు, ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొని ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా అరెస్టులకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు.ప్రధాన డిమాండ్లు ఇవే..29 జాతీయ కార్మిక చట్టాలను నాలుగు లేబర్ కోడ్లుగా మార్చిన నిర్ణయాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని, జాతీయ ఉపాధి హామీ పథకానికి మార్పులు చేస్తూ తీసుకొచ్చిన కొత్త చట్టాన్ని రద్దు చేయాలని నాయకులు డిమాండ్ చేశారు. విద్యుత్ బిల్లును, విత్తన చట్టాల్లో చేసిన మార్పులను ఉపసంహరించుకోవాలని కోరారు. నిత్యావసర వస్తువుల ధరలను నియంత్రించి సామాన్య ప్రజలపై పడుతున్న భారాన్ని తగ్గించాలని డిమాండ్ చేశారు.తిరుమలాయపాలెంలో నిర్వహించిన జైల్‌భరో కార్యక్రమానికి అఖిలపక్ష పార్టీల నాయకులు, కార్మికులు, రైతులు, వ్యవసాయ కూలీలు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికీ నాయకులు కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో సీపీఎం, కాంగ్రెస్, బీఆర్ఎస్, సీపీఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ, సీపీఐ(ఎంఎల్) మాస్‌లైన్, సీఐటీయూ, ఏఐకేఎంఎస్, కాంగ్రెస్ కిసాన్ సెల్, తెలంగాణ రైతు సంఘం, వ్యవసాయ కార్మిక సంఘం, డీవైఎఫ్ఐ, ఐద్వా, కేవీపీఎస్, పీఎన్ఎం, అరుణోదయ, ఆశ, మధ్యాహ్న భోజనం, బిల్డింగ్ వర్కర్స్, హమాలీ తదితర సంఘాల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.కార్యక్రమంలో ఖమ్మం జిల్లా టీజేఏసీ అధ్యక్షుడు మందడి ఇజ్రాయిల్, పిండిప్రోలు సర్పంచ్ కామల్ల సువార్త, వెదుళ్లచెరువు సర్పంచ్ ఆరెంపల వినోద, సీఐటీయూ మండల కార్యదర్శి వశపొంగు వీరన్న, ఏఐకేఎంఎస్ మండల అధ్యక్షుడు గొర్రెపాటి వీరస్వామి, పద్మనాభుల సుధాకర్, అంగిరేకుల నరసయ్య, నాగటి సురేష్, కట్కూరి శ్రీనివాస్‌రెడ్డి, మోరపాక నాగయ్య, నీరుడు లాజర్, అజ్మీర బాలాజీ, భానోత్ రవి, బానోత్ అనిల్‌కుమార్, రామావత్ రమణ, సామ శ్రీనివాస్‌రెడ్డి, పత్తి నాగేశ్వరరావు, గోళ్ల లింగయ్య, షేక్ షకీల్ పాషా, భాజా సత్యనారాయణ, దారమళ్ల కృష్ణ, దారమళ్ల శంకర్, ఆరెంపల వెంకన్న, రామనబోయిన నరసయ్య, శావగానే ఉపేందర్, నందిపాటి రామకృష్ణ, అడపు నాగేశ్వరరావు, నెరుసుల వెంకటేశ్వర్లు, తుళ్లూరు నాగేశ్వరరావు, కొత్తపల్లి వెంకన్న, బింగి రమేష్, కొమ్ము నాగేశ్వరరావు, పప్పుల ప్రసాద్, పప్పుల ఉపేందర్, దొండేటి సుగుణమ్మ, అల్లి యశోద, రావిండ్ల సుందర్, పప్పుల చిన ఉపేందర్, లింగంపల్లి సురేష్, బానోతు మోహన్, దారావత్ నరసింహారావు, గుగ్గిల అశోక్, పోలేపల్లి వెంకటేశ్వర్లు, కారేపాటి వీరస్వామి తదితరులు పాల్గొన్నారు.సుమారు 400 మంది స్వచ్ఛంద అరెస్టుజైల్భరో కార్యక్రమంలో పాల్గొన్న సుమారు 400 మంది కార్యకర్తలు, కార్మికులు, రైతులు, వ్యవసాయ కూలీలు స్వచ్ఛందంగా అరెస్టయ్యారు.

