చిన్నగూడూరు, ఆగస్టు 10 (నమస్తే న్యూస్)స్వాతంత్య్ర సమరయోధుడు, ప్రముఖ కమ్యూనిస్టు నాయకుడు దొంతు సత్తయ్య ఆరవ వర్ధంతిని సోమవారం ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన స్వగ్రామమైన మహబూబాబాద్ జిల్లా చిన్నగూడూరు మండలం గుండంరాజుపల్లిలోని దొంతు సత్తయ్య–సుశీల దంపతుల స్మారక స్థూపం వద్ద పార్టీ నాయకులు, కుటుంబ సభ్యులు నివాళులు అర్పించారు.ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. దొంతు సత్తయ్య ప్రజా సమస్యలపై నిరంతరం పోరాడిన ఉద్యమ నాయకుడని కొనియాడారు. స్వాతంత్య్ర ఉద్యమంతో పాటు కమ్యూనిస్టు ఉద్యమంలో ఆయన చేసిన సేవలు చిరస్మరణీయమని పేర్కొన్నారు. ప్రజల కోసం ఆయన సాగించిన పోరాట స్ఫూర్తిని నేటి తరం ఆదర్శంగా తీసుకోవాలని పిలుపునిచ్చారు.కార్యక్రమంలో సీపీఐ గ్రామ కార్యదర్శి గంజి శేషాద్రి, సీనియర్ నాయకుడు కందుల వెంకటయ్య, దొంతు సత్తయ్య కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

