తొర్రూరు,ఆగస్టు 9, (నమస్తే న్యూస్):బారీ వర్షాలు, తుఫాను ప్రభావం నేపథ్యంలో తొర్రూరు పట్టణ ప్రజలు అప్రమత్తంగా ఉండి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని మున్సిపల్ చైర్మన్ తూనం శ్రావణ్ కుమార్ విజ్ఞప్తి చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, వర్షాల సమయంలో అనవసరంగా బయటకు వెళ్లకుండా ఉండాలని,ముఖ్యంగా విద్యుత్ తీగలు,విద్యుత్ స్తంభాలను ఎట్టి పరిస్థితుల్లోనూ తాకరాదని సూచించారు.కరెంట్ స్తంభాలకు అనుసంధానంగా ఉన్న వైర్లను పట్టుకోవద్దని, ప్రమాదకర ప్రాంతాలకు దూరంగా ఉండి అప్రమత్తంగా వ్యవహరించాలని ప్రజలకు సూచించారు.ఏదైనా అత్యవసర పరిస్థితులు ఎదురైతే వెంటనే మున్సిపల్ అధికారులను లేదా మున్సిపల్ సిబ్బందిని సంప్రదించాలని కోరారు. పట్టణ ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని చర్యలు చేపట్టామని, మున్సిపల్ అధికారులు, సిబ్బంది ఎప్పటికప్పుడు అందుబాటులో ఉండి అవసరమైన సేవలు అందిస్తారని తెలిపారు.ప్రజలు అధికారులకు సహకరించి, వర్షాల సమయంలో వ్యక్తిగత భద్రతకు ప్రాధాన్యత ఇవ్వాలని మున్సిపల్ చైర్మన్ తూనం శ్రావణ్ కుమార్ విజ్ఞప్తి చేశారు.

