మహబూబాబాద్, ఆగస్టు 09(నమస్తే న్యూస్)
ఆదివాసి హక్కులకై కొమరం భీమ్ స్ఫూర్తితో ఉద్యమించాలని ఆల్ ఇండియా ట్రైబల్ ఫోరం (ఏఐటిఎఫ్) జాతీయ కమిటీ సభ్యులు కామ్రేడ్ గుగులోత్ శత్రు పిలుపునిచ్చారు. ప్రపంచ ఆదివాసి దినోత్సవం సందర్భంగా మహబూబాబాద్ పట్టణంలోని కొమరం భీమ్ విగ్రహం వద్ద ట్రైబల్ ఫోరం ఆధ్వర్యంలో కొమరం భీమ్ విగ్రహంకు పూలమాలవేసి ఘనంగా నివాళి ఆర్పించడం జరిగింది అనంతరం కార్యక్రమాలు ఉద్దేశించి కామ్రేడ్ సక్రు మాట్లాడుతూ నాడు జెల్ జంగల్ జమీన్ హమారా నినాదంతో పోరాటాలు కొనసాగించి హక్కులను సాధించుకోవడం జరిగింది ఐదవ షెడ్యూల్ 1/70 చట్టం పిసా చట్టం 2006 అటవి హక్కుల చట్టం లాంటి వాటిని సాధించుకో గా నేడు మోడీ ప్రభుత్వం వాటిని తుంగలో తొక్కి అటవీ హక్కుల సంరక్షణ నియమాలు 2022 పేరుతో చట్టానీ తీసుకువచ్చి అడవి, అటవీ సంపదపై పై ఆదివాసులకు ఎలాంటి హక్కులు లేకుండా కార్పొరేట్ శక్తులకు అడవిని అడవిలో ఉన్న సంపదను దోచిపెడుతుందని ఆవేదన వ్యక్తం చేశారు నాడు ఏజెన్సీలో ఎలాంటి అభివృద్ధి పనులు చేపట్టాలన్న గ్రామసభలు తీర్మానము రాష్ట్రపతి ఆమోదము తో ఉండేవి నేడు కేంద్ర ప్రభుత్వం వాటిని తుంగలో తొక్కి నేరుగా కేంద్ర ప్రభుత్వమే కార్పొరేట్ శక్తులు ఖనిజ సంపదను దోచుకుపోవడానికి పర్మిషన్లు ఇస్తూ అడవిని ధ్వంసం చేస్తున్నారని ప్రశ్నిస్తే నక్సలైట్ గా ఎదురు తిరిగితే ఎన్కౌంటర్లు చేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు నాటి పోరాట స్ఫూర్తితో ఆదివాసుల హక్కులను కాపాడుకుందామని అడవిని దోచుకుంటున్న కార్పొరేట్ శక్తులను తరిమి కొడదామని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో ట్రైబల్ ఫోరం నాయకులు చింత వెంకన్న హలావత్ లింగన్న టి పి జె సి రాష్ట్ర కో కన్వీనర్ మైస శ్రీనివాస్ అఖిల భారత రైతు కూలీ సంఘం రాష్ట్ర కోశాధికారి నందగిరి వెంకటేశ్వర్లు జిల్లా ప్రధాన కార్యదర్శి గుజ్జు దేవేందర్ ఐఎఫ్టియు జిల్లా అధ్యక్షులు పర్వత కోటేష్ పి వై ఎల్ జిల్లా నాయకులు జిల్లా అధ్యక్షులు సామ పాపయ్య తెలబోయిన కృష్ణ ట్రైబల్ ఫోరం నాయకులు బుర్కా దేవేందర్ బంగారు కృష్ణ వట్టం ఉమేష్ ఉప్పలయ్య వెంకన్న శ్రీశైలం తదితరులు పాల్గొన్నారు.

