రిపోర్టర్: దామల్ల భాస్కర్
తిరుమలాయపాలెం,ఆగస్ట్ 8 (నమస్తే న్యూస్).
ఆగస్టు 8 ,2026దేశంలో బీజేపీ అవలంబిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలపై మరో చికాగో పోరాటం చేయాలని సిఐటియు జిల్లా నాయకులు వశపంగువీరన్న కార్మిక లోకానికి పిలుపునిచ్చారు .ఈ సందర్భంగా సిఐటియు జిల్లా నాయకులు వసపంగు వీరన్న మాట్లాడుతూ దేశంలో బిజెపి ప్రభుత్వం 29 జాతీయ కార్మిక చట్టాలను తుంగలో తోక్కి నాలుగు లేబర్ కోడలుగా మార్చిందని ఈ నాలుగు లేబర్ కోడ్స్ వలన కార్మికుల పెద్ద ఎత్తున నష్టపోతున్నారని ఆయన అన్నారు ముఖ్యంగా ఎనిమిది గంటల పని విషయంలో ఆనాడు చికాగో నగరంలో కార్మికులు చేసిన పోరాట ఫలితంగానే ప్రాణ త్యాగాల వల్లనే ఎనిమిది గంటల పని దినాలు వచ్చిందని ఈ ఎనిమిది గంటల పని విధానాన్ని ఈ కార్మిక కోడ్స్ మారుస్తు చట్టం చేశారు దీనికి వ్యతిరేకంగా కార్మికులందరూ మరో చికాగో పోరాటానికి సిద్ధం కావాలని వారు పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో గ్రామపంచాయతీ కార్మికుల మండల కార్యదర్శి ఎస్కె బషీరు బిల్డింగ్ వర్కర్స్ యూనియన్ నాయకులు పట్ల అంజయ్య హమాలీ యూనియన్ నాయకులు గుండెబోయిన రవి కార్మిక నాయకులు ఎలిమల్లి కృష్ణ ఉపేందర్ వెంకన్న సలీం ఉపేందర్ భాష తదితరులు పాల్గొన్నారు.

