రిపోర్టర్ : దామల్ల భాస్కర్
తిరుమలాయపాలెం,ఆగస్టు 8 (నమస్తే న్యూస్)
తిరుమలాయపాలెం మండలం లోని పైనంపల్లి కాంగ్రెస్ గ్రామ శాఖ అధ్యక్షులుగా గట్టిగుండ్ల మైసయ్య ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు శనివారం కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు గండ్ర గోపాలరావు సమక్షంలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు మాజీ సర్పంచ్ గట్టిగుండ్ల రామయ్య కుమారుడైన గట్టిగుండ్ల మైసయ్యను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు ఈ సందర్భంగా గట్టిగుండ్ల మైసయ్య మాట్లాడుతూ తనపై నమ్మకం ఉంచి గ్రామ కాంగ్రెస్ అధ్యక్ష బాధ్యతలు అప్పగించిన పార్టీ నాయకులకు కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలిపారు గ్రామంలో కాంగ్రెస్ పార్టీని మరింత బలోపేతం చేసేందుకు కృషి చేస్తానని కార్యకర్తలను సమన్యాయం చేసుకుంటూ పార్టీ అభివృద్ధికి నిరంతరం పనిచేస్తానని అన్నారు పైనంపల్లి గ్రామంలో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడమే లక్ష్యంగా ముందుకు సాగుతానని గట్టి గుండ్ల మైసయ్య స్పష్టం చేశారు ఆయన ఎన్నికపై కాంగ్రెస్ శ్రేణులు హర్షం వ్యక్తం చేస్తూ శుభాకాంక్షలు తెలిపారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు గండ్ర గోపాలరావు గ్రామ కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

