కీసర రమేష్ రెడ్డి అధ్యక్షుడిగా, లింగాల మహేష్ గౌడ్ ప్రధాన కార్యదర్శిగా ఎన్నిక
మరిపెడ, ఆగస్టు 08 (నమస్తే న్యూస్):
మరిపెడ మండల కేంద్రంలోని కనకదుర్గ ఫంక్షన్ హాల్లో శుక్రవారం సాయంత్రం నిర్వహించిన పిఆర్టీయూ మరిపెడ మండల శాఖ సర్వసభ్య సమావేశంలో 2026–2028 సంవత్సరానికి నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ విషయాన్ని పిఆర్టీయూ రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షుడు కుడితి ఉపేందర్ రెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి చాగర్లమూడి శ్రీధర్ తెలిపారు.
ఎన్నికల అధికారి జి. రమేష్ కుమార్ ఎన్నికల ప్రక్రియను నిర్వహించారు.ఈ కార్యక్రమంలో సంఘ బాధ్యులు డి. లింగయ్య, బి. రాంమోహన్, ఎ. సునీల్ కుమార్, ఆర్. ఎల్లయ్య, పి. సరోజ, జి. కరుణాకర్, జి. వెంకన్నతో పాటు వివిధ మండలాల అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు, ప్రాథమిక సభ్యులు పాల్గొన్నారు.నూతనంగా ఎన్నికైన కార్యవర్గం ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తుందని, ప్రభుత్వంతో సమన్వయం చేసుకుంటూ ఉపాధ్యాయుల సంక్షేమానికి పాటుపడతామని నూతన అధ్యక్షుడు కీసర రమేష్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి లింగాల మహేష్ గౌడ్ తెలిపారు.

