రామకార్య సాధనలో ప్రతి అడుగు పవిత్రం
ప్రతి బియ్యపు గింజ ఒక మహా సంకల్పం!
సెంటర్: బయ్యారం
రిపోర్టర్: పిల్లల నరసింహారావు
గార్ల, ఆగస్టు 08(నమస్తే న్యూస్)
మహబూబాబాద్ జిల్లా గార్ల మండలంలోని వికాస తరంగిణి ఆధ్వర్యంలో, పరమపూజ్య శ్రీశ్రీశ్రీ త్రిదండి చినజీయర్ స్వామివారి 70వ తిరునక్షత్ర మహోత్సవాలను పురస్కరించుకుని గార్ల గ్రామంలో నిర్వహించిన “శ్రీరామ హృదయ కలశ శోభాయాత్ర” అత్యంత దిగ్విజయంగా, భక్తిపారవశ్యంతో ముగిసింది.పురవీధుల్లో మంగళ నీరాజనాలు, పూరీ వీధుల గుండా సాగిన ఈ శోభాయాత్రకు ప్రతీ ఇంటి ముందూ మహిళలు మంగళహారతులు, వర్ణరంజితమైన ముగ్గులతో దివ్య స్వాగతం పలికారు.108 బియ్యం గింజల దివ్య సంకల్పంప్రతి భక్తుడూ తన హృదయపూర్వక “శ్రీరామ” నామ స్మరణతో 108 పవిత్ర బియ్యం గింజలను కలశంలో సమర్పించి, స్వామివారి దివ్య అనుగ్రహాన్ని ,హృదయ పూర్వక ఆశీస్సులను పొంది పునీతులయ్యారు.ఐక్యతకు అద్దంపట్టిన వేడుకఊరు-వాడ ఏకమై, వికాస తరంగిణి సభ్యులు, ఆలయ నిర్వాహకులు, ఉత్సాహవంతులైన యువత, మహిళలు , గ్రామ పెద్దలు భక్తిశ్రద్ధలతో భాగస్వాములై సమాజంలో ఐక్యతను చాటిచెప్పారు. ధన్యవాద అభివందనం”మన సంస్కృతి – మన ధర్మం… రామనామ సాధనతోనే లోక కళ్యాణం!ఈ పవిత్రమైన శ్రీరామకార్యంలో పాల్గొని, తమ విలువైన సలహాలు, సహకారం అందించి శోభాయాత్రను సంపూర్ణంగా విజయవంతం చేసిన గార్ల మండల భక్తజనులందరికీ, యువతకు మరియు గ్రామ పెద్దలకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసిన వికాస తరంగిణి సభ్యులు.


