రిపోర్టర్:పిల్లల నరసింహారావు
సెంటర్:బయ్యారం
మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండల కేంద్రంలోని వివిధ గ్రామాలలో రేపు జరగబోయే ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా కొమరం భీమ్ విగ్రహం వద్ద ఆదివాసీ జెండా ఆవిష్కరణ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించనున్నట్లు బయ్యారంమండల ఆదివాసి సంఘాల జేఏసీ అధ్యక్షులు వర్స ప్రకాష్ దొర తెలిపారు. సందర్భంగా మాట్లాడుతూ…మండలంలోని ఆదివాసీ సంఘం నాయకులు, ఆదివాసీలు ఉదయం 9 గంటలకల్లా విగ్రహం వద్దకు చేరుకోవాలని ఆయన కోరారు. ఆదివాసీల సంస్కృతి, సంప్రదాయాలను కాపాడుకోవడంతో పాటు వారి హక్కుల సాధనకు జేఏసీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని అన్నారు. ఆదివాసుల మేధావులు, ఉద్యోగ సంఘాలు, ఆదివాసి నాయకులు, విద్యార్థులు, ప్రముఖులు, ఆదివాసిసమాజం పాల్గొని విజయవంతం చేయాలని అందరినీ విజ్ఞప్తి చేశాడు.

