భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రత్యేక చర్యలు
నరసింహులపేట,ఆగస్టు 08(నమస్తే న్యూస్):
ఆదివారం పడమటిగూడెం గ్రామంలో నిర్వహించే బోనాల పండుగను పురస్కరించుకొని గ్రామంలో ఘనంగా ఏర్పాట్లు చేస్తున్నారు. సర్పంచ్ జక్కుల ఉప్పలయ్య ఆధ్వర్యంలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అవసరమైన ఏర్పాట్లు చేపడుతున్నారు.పండుగ సందర్భంగా ఆలయ పరిసరాలు, గుడి ప్రాంగణంలో పారిశుద్ధ్య పనులను చేపట్టారు. ఇందులో భాగంగా జేసీబీ యంత్రం సహాయంతో పరిసరాలను శుభ్రం చేసి, భక్తులకు సౌకర్యవంతమైన వాతావరణం కల్పించేలా చర్యలు తీసుకున్నారు.బోనాల పండుగను భక్తిశ్రద్ధలతో, ప్రశాంత వాతావరణంలో విజయవంతంగా నిర్వహించేందుకు గ్రామస్తులు, భక్తులు సహకరించాలని సర్పంచ్ జక్కుల ఉప్పలయ్య పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ నవీన్ రెడ్డి, వార్డు సభ్యులు లత, మురళి, సునీల్, గ్రామ పెద్దలు రమేష్ గౌడ్, సింహాద్రి, సతీష్, రమేష్, మధు, వెంకన్న, ఉపేందర్, ఉప్పలయ్య, లింగయ్య, ఆగయ్య, అశోక్ తదితరులతో పాటు గ్రామపంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు.


