నర్సింహులపేట,ఆగస్టు07(నమస్తే న్యూస్)
మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేట మండల కేంద్రంలోని పద్మశాలి సంఘం అధ్యక్షుడు బత్తుల రమేష్ ఆధ్వర్యంలో శుక్రవారం జాతీయ చేనేత దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. జాతీయ నాయకుడు చేనేత రంగానికి విశేష సేవలందించిన కొండా లక్ష్మణ్ బాపూజీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.ఈ సందర్భంగా రాష్ట్ర పద్మశాలి సంఘం సహాయ కార్యదర్శి కొండబత్తిని జగదీశ్వర్,మండల సంఘం అధ్యక్షుడు బత్తుల రమేష్ మాట్లాడుతూ.. నేత కార్మికులు అనేక సమస్యలతో జీవనం సాగిస్తున్నారని,ప్రభుత్వం చేనేత రంగానికి ప్రాధాన్యత నివ్వాలని కోరారు. ప్రతి ఒక్కరూ చేనేత వస్త్రాలను దారిలించి నేతన్నను బ్రతికించాలని కోరారు.ఈ కార్యక్రమంలో గ్రామ అధ్యక్షుడు మేకల యాకయ్య,యూత్ నాయకుడు బాల్య శ్రీనివాస్,కూరపాటి శ్రీనివాస్,వెన్నం వెంకన్న,కొండబత్తిని రమేష్,పెండెం యాదగిరి,పాము వెంకన్న,కోట వెంకన్న,కస్తూరి వెంకన్న,మేకల సుధాకర్,కుమార్,శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.

