మాజీ డిసిసి ప్రధాన కార్యదర్శి తాటిపాముల శేఖర్ గౌడ్
రామన్నపేట, ఆగస్టు 7 (నమస్తే న్యూస్)
ఏఐసీసీ తెలంగాణ పీసీసీ మీడియా, ప్రచార కమిటీ చైర్మన్ గా భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డిని తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ నియమించింది.ఈ నియామకంపై మాజీ ఎంపీటీసీ, మాజీ డిసిసి ప్రధాన కార్యదర్శి తాటిపాముల శేఖర్ గౌడ్ హర్షం వ్యక్తం చేశారు, రాష్ట్రంలో కాంగ్రెస్ మరోసారి అధికారంలోకి వస్తుందని, తెలంగాణకు రావాల్సిన నిధులు రాబట్టడంలో ఎంపీ చామల కీలకంగా ఉంటారని తెలిపారు.ఈ అవకాశం కల్పించిన ఏఐసీసీ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ, సోనియా గాంధీ, ప్రియాంక గాంధీ కి కృతజ్ఞతలు తెలిపారు.

