రామన్నపేట, ఆగస్టు 7 (నమస్తే న్యూస్)
యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలం సిరిపురం అంగన్వాడీ కేంద్రాలలో అన్నప్రాసన కార్యక్రమాన్ని ,ఫంక్షన్ గా నిర్వహించడం జరిగింది, తల్లిపాలు తల్లిపాలతోపాటు అనుబంధ అహారం, 2సంవత్సరాలు వరకు బిడ్డకు తల్లిపాలు కొనసాగించాలి,బిడ్డ పుట్టిన వెంటనే ముర్రుపాలు పట్టించాలని అవే బిడ్డకు వ్యాధినిరోధక టీకలాగా పనిచేస్తుందని బిడ్డకు 6నెలల వరకు కేవలం తల్లిపాలు పట్టించాలని వివరించడం జరిగింది, ఈ కార్యక్రమం లో పాల్గొన్నవారు,భాగంగా గ్రామ సర్పంచ్ అంబటి ఉపేంద్ర రవీందర్ రెడ్డి, ఉపసర్పంచ్ మూడుదూడ్ల అనూష రమేష్, పంచాయితీ కార్యదర్శి ఎం,జ్యోతి వార్డు సభ్యులు జెల్ల సూర్య కళా, శ్రీనాథం ,పగుడాల లక్ష్మి ,ఏఎన్ఎం, శ్యామల అంగన్వాడీ టీచర్స్ వసంత, జ్యోతి, సునీత ,నవనీత, ఆశలు, మహిళసంఘ సభ్యులు, ఆరోగ్యలక్ష్మి కమిటి సభ్యులు, గర్భిణీ లు, బాలింతలు, తల్లులు ఈ కార్యక్రమంలోపాల్గొనడం జరిగింది.

