రామన్నపేట, ఆగస్టు 7 (నమస్తే న్యూస్)
రామన్నపేట యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండల కేంద్రంలో అనారోగ్యంతో మృతి చెందిన కాటం నరసింహ మృతికి చింతిస్తూ, హంస ఫౌండేషన్ జిల్లా ఉపాధ్యక్షులు, టి యు ఎఫ్ మైనార్టీ సెల్ కన్వీనర్ టిఆర్ఎస్ జిల్లా నాయకులు ఎస్కే చాంద్ మానవత్వం చాటుతూ తన వంతు సహాయంగా పేద కుటుంబానికి 50కేజీల బియ్యం, 2500 రూపాయలు మృతుని కుటుంబ సభ్యులకు అందజేసి, నిరుపేద కుటుంబమైన నరసింహ కుటుంబ సభ్యులను ఆర్థికంగా దాతలు ముందుకు వచ్చి ఆదుకోవాలని ఈ సందర్భంగా కోరారు, ఈయన వెంట పాల్గొన్నవారు, మైనార్టీ నాయకులు మహమ్మద్ జానీ, మల్లం సైదులు, కాటం రమేష్, కాటం నిర్మల, మమతా తదితరులు పాల్గొన్నారు.

