రామన్నపేట,ఆగస్ట్ 07(నమస్తే న్యూస్):యాదాద్రి భువనగిరి జిల్లా – రామన్నపేట మండలం–బోగారం గ్రామంలో పరిశుభ్రత పచ్చదనం తడి చెత్త పొడి చెత్త వేరు చేసే విధానాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు, ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ కునూరు సాయికుమార్ గౌడ్ హాజరై మాట్లాడుతూ,ఈ సందర్భంగా గ్రామ ప్రజలకు చెత్తను వేరు చేసి, సరైన చెత్తబుట్టలో వేయడం అలవాటు చేసుకోవాలని అవగాహన కల్పించారు,తడి చెత్త, పొడి చెత్త తదితర వ్యర్థాలను వేరు వేరు చేయడం ద్వారా దోమల బెడద తగ్గుతుందని ప్రజలందరూ ఆరోగ్యకరంగా ఉంటారని, పరిశుభ్రత పచ్చదనం పాటిస్తే ఆరోగ్యమంతమైన గ్రామం ఆదర్శవంతంగా గ్రామాన్ని తీర్చిదిద్దుకోవచ్చునని వివరించారు,ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారు ఉపసర్పంచ్ బైకాని ఉమా మహేష్ యాదవ్, వార్డు మెంబర్లు నేరటి మానససురేష్ యాదవ్, మేడి ఆంజనేయులు, కనుక మల్లేష్, చిరగోని శిల్పానవీన్ యాదవ్, వనం అండాలుయాదగిరి గ్రామపంచాయతీ కార్యదర్శి ఏ. సుధా, సంఘబంధం అధ్యక్షురాలు పబ్బు జ్యోతి, ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్ గాదే హేమలత, వీవోఏ భోగ సంధ్య పాల్గొన్నారు,అలాగే గ్రామ పెద్దలు కూనూరు మహేష్ గౌడ్, బైకాని మహేష్ యాదవ్, మేడి కృష్ణ, మేడి ముఖేష్, గ్రామపంచాయతీ సిబ్బంది, మహిళలు గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

