మరిపెడ,ఆగస్టు 07(నమస్తే న్యూస్).
డోర్నకల్ నియోజకవర్గ పరిధిలోని మరిపెడ మండలం మరియు మరిపెడ పట్టణ అధ్యక్షులను ఈరోజు ఎన్నుకోవడం జరిగింది.డోర్నకల్ శాసనసభ్యులు,తెలంగాణ ప్రభుత్వ విప్ డాక్టర్ జాటోతో రామచంద్రనాయక్ ఆదేశాల మేరకు పార్టీ నాయకుల సమక్షంలో ఈ నియామకాలు చేపట్టారు.ఈ సందర్భంగా: 1. మరిపెడ మండల అధ్యక్షులుగా-గుగులోత్ రవి నాయక్2. మరిపెడ పట్టణ అధ్యక్షులుగా-భానోత్ రాంలాల్ నాయక్.ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.నూతన అధ్యక్షులు మాట్లాడుతూ…గుగులోత్ రవి నాయక్.పార్టీ నాయకత్వం నాపై ఉంచిన నమ్మకానికి,కృతజ్ఞతతో ఉంటూ పార్టీ ఆదేశాలను అనుసరిస్తూ నడుచుకుంటానని,అలాగే మరిపెడ మండలంలో ప్రతి గ్రామానికి ప్రభుత్వ పథకాలు అందేలా,పార్టీని గడప గడపకు బలోపేతం చేసేందుకు కృషి చేస్తాను.డాక్టర్ రామచంద్రనాయక్ నాయకత్వంలో మరిపెడను అభివృద్ధి పథంలో నడిపిస్తామని అన్నారు.భానోత్ రాంలాల్ నాయక్.పట్టణ అధ్యక్షుడిగా నాకు ఇచ్చిన అవకాశానికి ధన్యవాదాలు.యువకులను,కార్యకర్తలను కలుపుకొని పార్టీ కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్తాను.మరిపెడ పట్టణ సమస్యల పరిష్కారానికి ప్రజలతో కలిసి పనిచేస్తానని అన్నారు.నూతనంగా బాధ్యతలు స్వీకరించిన ఇరువురు నాయకులకు పార్టీ శ్రేణులు,కార్యకర్తలు అభినందనలు తెలిపారు. మరిపెడ ప్రజల సంక్షేమం మరియు పార్టీ బలోపేతమే ధ్యేయంగా ముందుకు సాగుతామని నూతన అధ్యక్షులు తెలిపారు.డాక్టర్ జాటోతో రామచంద్రనాయక్ నాయకత్వంలో డోర్నకల్ నియోజకవర్గం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుందని ఆకాంక్షించారు.

