బాణాసంచా పేల్చి హర్షం వ్యక్తం చేసిన కాంగ్రెస్ శ్రేణులు.
గత ముప్ఫై ఏళ్ల పైగా కాంగ్రెసు కార్యకర్తగా సేవలందిస్తున్న సోమిరెడ్డి.
అధిష్టానానికి కృతజ్ఞతలు తెలిపిన సోమిరెడ్డి.
నర్సింహులపేట, ఆగస్టు 7 (నమస్తే న్యూస్)
కాంగ్రెస్ పార్టీ అధిష్టానం నిర్ణయం మేరకు, డోర్నకల్ నియోజకవర్గ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ డాక్టర్ జాటోత్ రామచంద్ర నాయక్ ఆదేశాల ప్రకారం మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేట మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా బొబ్బ సోమిరెడ్డిని నియమించినట్లు పార్టీ నాయకులు తెలిపారు.ఈ సందర్భంగా నూతన మండల అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన బొబ్బ సోమిరెడ్డికి కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. మండల కేంద్రంలో బాణాసంచా పేల్చి, ఒకరికొకరు మిఠాయిలు పంచుకుని హర్షం వ్యక్తం చేశారు. అనంతరం నూతన అధ్యక్షుడికి పూలమాలలు వేసి శుభాకాంక్షలు తెలియజేస్తూ, పార్టీ బలోపేతానికి ఆయన నాయకత్వంలో సమష్టిగా పనిచేస్తామని నాయకులు పేర్కొన్నారు.ఈ సందర్భంగా బొబ్బ సోమిరెడ్డి మాట్లాడుతూ, పార్టీ అధిష్టానం తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని, ఎమ్మెల్యే డాక్టర్ జాటోత్ రామచంద్ర నాయక్ ఆశయాలకు అనుగుణంగా మండలంలో కాంగ్రెస్ పార్టీని మరింత బలోపేతం చేసేందుకు కార్యకర్తలందరినీ సమన్వయం చేసుకుని పనిచేస్తానని తెలిపారు. పార్టీ అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారమే తన ప్రధాన లక్ష్యమని ఆయన పేర్కొన్నారు. కాంగ్రెస్ శ్రేణులు ఆయనకు అభినందనలు తెలుపుతూ నూతన బాధ్యతల్లో విజయవంతం కావాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ పెద్దమాముల యాకయ్య, ఉప సర్పంచ్ కాస యాకయ్య, గ్రామ పార్టీ అధ్యక్షులు మంచినీళ్ల రఘు, యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు నిమ్మల శ్రీనివాస్ యాదవ్, మండల నాయకులు బత్తుల రమేష్, ఎర్ర రవి, పొన్నం సోమేశ్, గౌని యాదగిరి, తదితరులు పాల్గొన్నారు



