ప్రత్యేక పూజలు నిర్వహించి ప్రజల సంక్షేమం కోరిన కౌన్సిలర్లు,కాంగ్రెస్ నేతలు.
కారంపురి: వెంకటేశ్వర్లు నేత.
డోర్నకల్/మరిపెడ,ఆగస్టు 7(నమస్తే న్యూస్)
ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారంలో కొలువైన ఆదివాసీల ఆరాధ్య దైవాలు సమ్మక్క – సారలమ్మ వన దేవతలను శుక్రవారం మరిపెడ మున్సిపల్ చైర్ పర్సన్ ప్రగతి శ్రీపాల్ రెడ్డి దర్శించుకున్నారు. ఈ సందర్భంగా అమ్మవార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. రాష్ట్ర ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని,పంటలు బాగా పండాలని,ఆదివాసీ గిరిజన సంక్షేమం కొనసాగాలని అమ్మవార్లను ప్రార్థించారు. ప్రగతి శ్రీపాల్ రెడ్డి వెంట మున్సిపల్ కౌన్సిలర్లు మెరుగు రాము, జాటోతు సురేష్,నీలా లచ్చిరామ్, జియో రమేష్, పానుగోతు రాములు, కాంతమ్మ కరణ్ సింగ్ మరియు కో ఆప్షన్ సభ్యుడు షేక్ అజీజ్ పాషా పాల్గొన్నారు. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు టౌన్ అధ్యక్షుడు షేక్ తాజుద్దీన్, అలువాల ఉపేందర్ ప్రజాపతి, గంధసిరి భిక్షపతి, దూగుంట్ల వెంకన్న, గంధసిరి సోమన్న, పొన్నం వినయ్, వెంకన్న, అనంతగిరి శ్రీను, పాషా, షబ్బీర్, కుమార్ తదితరులు ఈ దర్శనంలో పాల్గొన్నారు. మేడారం దేవతల ఆశీస్సులతో మరిపెడ మున్సిపాలిటీ మరింత అభివృద్ధి చెందాలని, ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు కృషి చేస్తామని ప్రగతి శ్రీపాల్ రెడ్డి అన్నారు.

