బిఆర్ఎస్ పార్టీ తరపున మంత్రి పొంగులేటి కి వినతి. బిఆర్ఎస్ మండల పార్టీ నాయకులు రంగాపురం బాలకృష్ణ గౌడ్
రిపోర్టర్ దామల్ల భాస్కర్
తిరుమలాయపాలెం, ఆగస్టు 7 (నమస్తే న్యూస్)
తిరుమలాయపాలెం మండలం లోని రాజారం గ్రామంలోని సమస్యలపై బిఆర్ఎస్ పార్టీ పక్షాన గ్రామ శాఖ అధ్యక్షులు రంగాపురం బాలకృష్ణ గౌడ్ ఆధ్వర్యంలో ఈరోజు గ్రామం విచ్చేసిన మంత్రి పొంగులేటి ని కలిసి వినతి పత్రం ఇచ్చారు. మొదటి విడతలో ఇందిరమ్మ ఇండ్లు మా గ్రామనికి తొమ్మిది మాత్రమే వచ్చాయని రెండో విడతలో 30 ఇండ్లు కేటాయించాలని, డ్రైనేజ్ వ్యవస్థ సరిచేయాలనీ. కాలనీకి తాగునీటి సౌకర్యం కోసం ట్యాంక్ ఏర్పాటు చేయాలని, స్కూల్లో అదనపు టీచర్ల ను నియమించాలని, బచ్చోడు గ్రామాన్ని మండల కేంద్రం చేయాలని, బచ్చోడు నుండి మామిళ్ళగూడెం వరకు రెండు వరుసల రహదారి నిర్మించాలని అలాగే గొర్లకాపర్ల మరియు రైతుల సమస్యలపై మంత్రికి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్బంగా మంత్రి సానుకూలంగా స్పందించి సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.

