మరిపెడ మున్సిపల్ చైర్పర్సన్ ప్రగతి శ్రీపాల్ రెడ్డి.
మున్సిపల్ కమీషనర్ కంచర్ల నరేష్ రెడ్డి.
మరిపెడ,ఆగస్టు 06 (నమస్తే న్యూస్):
మరిపెడ పట్టణంలోని జర్నలిస్ట్ కాలనీలో నివాసితులు ఎదుర్కొంటున్న మౌలిక సమస్యలను తెలుసుకునేందుకు గురువారం మున్సిపల్ చైర్పర్సన్ వీసారపు ప్రగతి శ్రీపాల్ రెడ్డి, మున్సిపల్ కమిషనర్ కంచర్ల నరేష్ రెడ్డి కాలనీలో పర్యటించారు. ఈ సందర్భంగా కాలనీలోని రోడ్లు, డ్రైనేజీ, వీధి దీపాలు, తాగునీటి సరఫరా,పారిశుధ్య పరిస్థితులను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. కాలనీ అభివృద్ధికి అవసరమైన పనులను వెంటనే ప్రారంభించి త్వరగా పూర్తి చేసేందుకు సంబంధిత అధికారులతో చర్చించి పరిష్కరించే దిశగా చర్యలు తీసుకుంటామని కాలనీవాసులకు హామీ ఇచ్చారు. ఈ పర్యటనలో కౌన్సిలర్ జాటోతు సురేష్, కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు అలువాల ఉపేందర్ ప్రజాపతి, జర్నలిస్టులు గండి విష్ణు, మారం అనంత రాములు, షేక్ సత్తార్ పాషా, బోడ నాగేందర్, మున్సిపల్ వార్డ్ ఆఫీసర్ పాషా తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కాలనీవాసులు తమ సమస్యలను నాయకుల దృష్టికి తీసుకువచ్చారు. వాటిపై సానుకూలంగా స్పందించిన చైర్పర్సన్, కమిషనర్ త్వరలోనే పరిష్కార చర్యలు చేపడతామని తెలిపారు.

