మున్సిపల్ కార్యాలయంలో ఘనంగా ఆచార్య జయశంకర్ జయంతి.
మరిపెడ,ఆగస్టు 06(నమస్తే న్యూస్):మరిపెడ పట్టణంలోని పురపాలక సంఘ కార్యాలయంలో గురువారం తెలంగాణ జాతిపిత ఆచార్య జయశంకర్ 90వ జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పురపాలక సంఘ చైర్ పర్సన్ వీసారపు ప్రగతి శ్రీపాల్ రెడ్డి,కమిషనర్ కంచర్ల నరేష్ రెడ్డితో కలిసి జయశంకర్ సార్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.ఈ కార్యక్రమంలో చైర్పర్సన్ ప్రగతి శ్రీపాల్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఆచార్య జయశంకర్ చేసిన కృషి అమూల్యమైనదని అన్నారు.తెలంగాణ ఉద్యమానికి సైద్ధాంతిక పునాది వేసిన మేధావి జయశంకర్ అని,ఆయన ఆశయాలను కొనసాగించడమే అందరికీ నిజమైన నివాళి అని పేర్కొన్నారు.తెలంగాణ అభివృద్ధికి,పేదల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు.ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు తిరుపతి నాయక్,పానుగోతు రాములు,మెరుగు రాము,కాంతమ్మ కరణ్ సింగ్,నీలా లచ్చిరామ్,గంట్ల గౌతమ్ రెడ్డి,జాటోతు సురేష్,జియో రమేష్,కో-ఆప్షన్ సభ్యులు గుండగాని వెంకన్న,షేక్ అజీజ్,కాంగ్రెస్ పార్టీ నాయకులు అలువాల ఉపేందర్ ప్రజాపతి,గంధసిరి భిక్షపతి తదితరులు పాల్గొన్నారు.ఆచార్య జయశంకర్ తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు ప్రతిరూపమని,ఆయన చూపిన బాటలో మనమందరం ముందుకు సాగుదామని ఈ సందర్భంగా నాయకులు తెలిపారు.

