బయ్యారం, ఆగస్టు 6 (నమస్తే న్యూస్): మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలం కొత్తపేట గ్రామంలో విషాద ఘటన చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన చింత సైదులు (50), ఎస్.టి. (కోయ), వ్యవసాయం చేస్తూ జీవనం సాగిస్తున్నాడు.శుక్రవారం ఉదయం సుమారు 11:30 గంటలకు తన వ్యవసాయ బావి వద్ద మోటార్ పైపును బిగించే పనిలో ఉండగా ప్రమాదవశాత్తు కాలుజారి బావిలో పడిపోయాడు. మృతుడికి ఈత రాకపోవడంతో నీటిలో మునిగి ఊపిరాడక అక్కడికక్కడే మృతి చెందినట్లు తెలిసింది.మృతుడి అల్లుడు ధార సాంబశివరావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు బయ్యారం పోలీస్ స్టేషన్ ఎస్.ఐ. టి. ప్రశాంత్ బాబు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఘటనతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
