వంతడుపుల గ్రామపంచాయతీలో ఘనంగా జయంతి వేడుకలు
నర్సింహులపేట, ఆగస్టు 6 (నమస్తే న్యూస్):మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేట మండలం వంతడుపుల గ్రామపంచాయతీ కార్యాలయంలో తెలంగాణ సిద్ధాంతకర్త, ఆచార్య కొత్తపల్లి జయశంకర్ జయంతి వేడుకలను గురువారం ఘనంగా నిర్వహించారు. గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి గ్రామ సర్పంచ్ మాలోత్ బాలు నాయక్ అధ్యక్షత వహించారు.ఈ సందర్భంగా ఆచార్య జయశంకర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం సర్పంచ్ బాలు నాయక్ మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఆచార్య జయశంకర్ జీవితాంతం చేసిన కృషి చిరస్మరణీయమని అన్నారు. ఆయన ఆశయాలు, సిద్ధాంతాలు నేటి తరానికి ఆదర్శమని పేర్కొన్నారు. తెలంగాణ అభివృద్ధికి ప్రతి ఒక్కరూ ఆయన చూపిన మార్గంలో నడవాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో గ్రామపంచాయతీ సిబ్బంది, ప్రజాప్రతినిధులు, గ్రామ పెద్దలు, యువకులు, ప్రజలు పాల్గొని ఆచార్య జయశంకర్‌కు ఘనంగా నివాళులర్పించారు.
