రూ.5 వేల జరిమానా విధించిన మహబూబాబాద్ కోర్టు.
.నరసింహులపేట, ఆగస్టు 05(నమస్తే న్యూస్):
నరసింహులపేట పోలీస్ స్టేషన్ పరిధిలో 2021లో నమోదైన హత్యాయత్నం కేసులో ప్రధాన నిందితుడికి మహబూబాబాద్ అసిస్టెంట్ సెషన్స్ కోర్టు రెండేళ్ల కఠిన కారాగార శిక్షతో పాటు రూ.5 వేల జరిమానా విధించింది.పోలీసుల వివరాల ప్రకారం, 2021లో క్రైమ్ నంబర్ 41/2021గా ఐపీసీ సెక్షన్లు 290, 307, 34 కింద నమోదైన కేసులో విచారణ పూర్తి చేసిన మహబూబాబాద్ అసిస్టెంట్ సెషన్స్ కోర్టు న్యాయమూర్తి షాలినీ షకేలి తీర్పు వెలువరించారు. కేసులో ప్రధాన నిందితుడు జాటోతు నరేష్‌ను దోషిగా నిర్ధారించి రెండేళ్ల కఠిన కారాగార శిక్షతో పాటు రూ.5 వేల జరిమానా విధించారు. మిగిలిన నిందితులు ఏ2, ఏ3లను సాక్ష్యాధారాల లేమితో నిర్దోషులుగా విడుదల చేశారు.ఈ కేసులో ప్రభుత్వ తరఫున పబ్లిక్ ప్రాసిక్యూటర్ డి. గణేష్ ఆనంద్ వాదనలు వినిపించారు. కేసు దర్యాప్తు అప్పటి నరసింహులపేట ఎస్సై ఎల్. నరేష్ నిర్వహించగా, కోర్టు విధుల్లో హెడ్ కానిస్టేబుల్ పి. వెంకన్న, కోర్టు లైజనింగ్ అధికారిగా ఎస్సై షకీర్ సేవలందించారు. కేసు పర్యవేక్షణను తొర్రూరు సర్కిల్ సీఐ టి. గణేష్, నరసింహులపేట ఎస్సై బి. వెంకన్న నిర్వహించారు.

