రామన్నపేట,ఆగస్టు 06(నమస్తే న్యూస్): యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలం దుబ్బాక గ్రామానికి చెందిన రైతు రేవనాల ఐలయ్య (46) అస్వస్థతకు గురై మృతి చెందిన ఘటన చోటుచేసుకుంది.పోలీసుల వివరాల ప్రకారం.. ఆగస్టు 5న సాయంత్రం ఐలయ్య తన కుమార్తె శివమణితో కలిసి పొలానికి వెళ్లి వ్యవసాయ పనులు ముగించుకుని ఇంటికి వచ్చారు. రాత్రి భోజనం అనంతరం నిద్రకు సిద్ధమవుతున్న సమయంలో ఒక్కసారిగా కుప్పకూలి నోటి నుంచి నురుగు రావడంతో కుటుంబ సభ్యులు వెంటనే రామన్నపేట ఏరియా ఆసుపత్రికి తరలించారు. వైద్యులు చికిత్స అందించినప్పటికీ రాత్రి సుమారు 11 గంటల సమయంలో ఆయన మృతి చెందినట్లు నిర్ధారించారు.మృతుడి భార్య రేవనాల పద్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు రామన్నపేట ఎస్సై సతీష్ గౌహతి ఒక ప్రకటనలో తెలిపారు.

