ఇబ్రహీంపట్నంలోని శ్రీ ఆయుష్ మల్టీస్పెషాలిటీ హాస్పిటల్లో ముందస్తుగా నిర్వహణ
• కేక్ కట్ చేసి శాలువాతో సన్మానం చేసిన ఆస్పత్రి యాజమాన్యంఇబ్రహీంపట్నం.
ఆగస్టు 6 (నమస్తే న్యూస్):తెలంగాణ పీసీసీ ఎస్సీ విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డా. ఉక్కుల అశోక్ జన్మదినాన్ని పురస్కరించుకుని ఇబ్రహీంపట్నంలోని శ్రీ ఆయుష్ మల్టీస్పెషాలిటీ హాస్పిటల్ ఆధ్వర్యంలో ఒక రోజు ముందుగానే ఘనంగా వేడుకలు నిర్వహించారు.ఈ సందర్భంగా ఆస్పత్రి యాజమాన్యం డా. ఉక్కుల అశోక్‌తో కేక్ కట్ చేయించి, శాలువాతో సత్కరించి ఘనంగా సన్మానించింది. అనంతరం ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ, ప్రజాసేవలో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో శ్రీ ఆయుష్ మల్టీస్పెషాలిటీ హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్ డా. చక్రపాణి, సీఈఓ నాగరాజు, మదర్ గుడ్ ఫౌండేషన్ చైర్మన్ డా. శంకర్, జనరల్ సెక్రటరీ నయినంపల్లి శ్రీనివాస్ గౌడ్, సుధాకర్ తదితరులు పాల్గొని డా. ఉక్కుల అశోక్‌ను అభినందించారు.



