నూతన మత్స్య పారిశ్రామిక అధ్యక్షుడిగా నూతి వెంకటేశం.
రామన్నపేట,ఆగస్ట్ 05(నమస్తే న్యూస్)
చిట్యాల మండలంలోని పెద్దకాపర్తి గ్రామంలో బుధవారం రోజున జరిగిన ముదిరాజ్ మత్య పారిశ్రామిక సహకార సంఘం ఎన్నికలలో నూతి వెంకటేశం ప్యానల్ 9 మంది డైరెక్టర్స్ ఉత్కంఠ భరితంగా జరిగిన సొసైటీ ఎలక్షన్స్ లో ఎన్నుకోవడం జరిగింది. డైరెక్టర్లుగానూతి వెంకటేశం, గుండెబోయిన నరసింహ , గుండెబోయిన రాజు , గుండెబోయిన మహేష్ , దేశగొని గణేష్ , భైరవోని పెద్ద స్వామి , నూతి గణేష్ , నాశ బోయిన శకుంతల , బుంగపట్ల వెంకమ్మ లను డైరెక్టర్లుగా గెలుపొందారు. స్థానిక ఎమ్మెల్యే వేముల వీరేశం సహకారంతో మరియు సర్పంచ్ సహకారంతో గతంలో చేసిన అభివృద్ధి పనులతో పాటు, భవిష్యత్తులో కూడా సంగం అభివృద్ధికి పాటుపడతానని సంఘం సభ్యులందరికీ ఎల్లవేళలా అందుబాటులో ఉంటానని నూతి వెంకటేష్ హామీ ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో మాజీ అధ్యక్షులు బుంగపట్ల తిమ్మయ్య మరియు నాశ బోయిన యాదయ్య, బుంగపట్ల సత్తయ్య, భైరవుని బిక్షం, గుండెబోయిన చంద్రయ్య, గుండెబోయిన సాలయ్య, గుండెబోయిన స్వామి, దేశగాని మహాలింగం, నూతి యాదయ్య, నూతి నరసింహ, గుండ్ల నరసింహ, చిలుముల చంద్రయ్య, గుండెబోయిన నరసింహ తదితరులు పాల్గొన్నారు.

