రామన్నపేట మండలంలో అర్హులైన లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ చెక్కుల అందజేత.
ప్రజలకు అండగా నిలుస్తున్న ప్రభుత్వం: ఎండి జమీరుద్దీన్
రామన్నపేట, ఆగస్టు 5 (నమస్తే న్యూస్):తెలంగాణ ప్రభుత్వ విప్, నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం సహకారంతో మంజూరైన ముఖ్యమంత్రి సహాయ నిధి (సీఎంఆర్ఎఫ్) చెక్కులను రామన్నపేట మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన అర్హులైన లబ్ధిదారులకు బుధవారం అందజేశారు.ఈ సందర్భంగా రామన్నపేట పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు మొహమ్మద్ జమీరుద్దీన్ మాట్లాడుతూ, ఆపదలో ఉన్న పేద, మధ్యతరగతి కుటుంబాలకు ముఖ్యమంత్రి సహాయ నిధి ఎంతో భరోసాగా నిలుస్తోందన్నారు. ప్రజలకు అవసరమైన సమయంలో ఆర్థిక చేయూత అందించడంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ చూపుతోందని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు మోటే మహేష్, కందుల అండాలు, కాంగ్రెస్ సీనియర్ నాయకులు బండ అంజిరెడ్డి, నక్క యాదయ్య, పిట్ట రామిరెడ్డి, శంబాల వెంకన్న, చింతల కృష్ణ, గొలుసుల ప్రసాద్, మాల్గా వెంకటేష్, బండ బాలరాజ్, బొడ్డు ఉపేందర్ తదితరులు పాల్గొన్నారు.

