రిపోర్టర్ దామల్ల భాస్కర్
తిరుమలాయపాలెం,ఆగస్టు 5 (నమస్తే న్యూస్ )
ఐసిడిఎస్ ఆధ్వర్యంలో అంగన్వాడీ కేంద్రంలో కమ్యూనిటీ బేస్డ్ ఈవెంట్ సి బి ఈ నిర్వహించి, అన్నప్రాశన కార్యక్రమంతో పాటు ప్రపంచ తల్లిపాల వారోత్సవాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గర్భిణీలు, బాలింతలు, తల్లులు, చిన్నారులు, కుటుంబ సభ్యులు, అంగన్వాడీ సిబ్బంది పాల్గొన్నారు.
ఈ కార్యక్రమానికి సర్పంచ్ నరేందర్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని, తల్లులు పిల్లల ఆరోగ్యం, పోషకాహారం ప్రాముఖ్యతపై అవగాహన కల్పించారు. ఐసిడిఎస్ సూపర్వైజర్ సాదియా తల్లిపాల ప్రాముఖ్యత, అనుబంధ ఆహారం మరియు శిశు పోషణపై తల్లులకు వివరించారు.
తల్లిపాలు – తల్లికి, బిడ్డకు ఎంతో మేలు శిశువు పుట్టిన *మొదటి గంటలోపు తల్లిపాలు పట్టించడం ఎంతో ముఖ్యమని, మొదటి 6 నెలల పాటు శిశువుకు కేవలం తల్లిపాలనే ఇవ్వాలని సిబ్బంది సూచించారు. తల్లిపాలు బిడ్డకు అవసరమైన పోషకాలను అందించడంతో పాటు రోగనిరోధక శక్తిని పెంచి, అతిసారం, శ్వాసకోశ ఇన్ఫెక్షన్లు వంటి అనారోగ్యాల నుంచి రక్షణ కల్పించడంలో సహాయపడతాయని తెలిపారు.
తల్లిపాలు ఇవ్వడం వల్ల తల్లిలో ప్రసవానంతర రక్తస్రావం తగ్గడానికి గర్భాశయం త్వరగా సాధారణ స్థితికి రావడానికి సహాయపడుతుందని, అలాగే తల్లి–బిడ్డల మధ్య అనుబంధాన్ని బలోపేతం చేస్తుందని వివరించారు. దీర్ఘకాలంలో తల్లిలో రొమ్ము క్యాన్సర్, అండాశయ క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గించడంలో కూడా తల్లిపాలు ఈ సందర్భంగా మొదటి 1000 రోజుల ప్రాముఖ్యత, తల్లిపాలు, అనుబంధ ఆహారం, శిశు పోషణ మరియు ఆరోగ్యకరమైన ఎదుగుదల పై తల్లిదండ్రులకు అవగాహన కల్పించారు. అనంతరం చిన్నారులకు అన్నప్రాశన కార్యక్రమాన్ని నిర్వహించారు. సర్పంచ్ నరేందర్ రెడ్డి ఐసిడిఎస్ సూపర్వైజర్ సాదియా అంగన్వాడీ టీచర్స్ సుహాసిని, పూలమ్మ ; అంగన్వాడీ ఆయాలు ఆశాలు కార్యకర్త ఉమా , పంచాయతీ సెక్రటరీ శ్రీకాంత్, స్కూల్ టీచర్ సుధీర్, గ్రామ దీపికా వసంత, తల్లులు, బాలింతలు, కుటుంబ సభ్యులు చిన్నారులు కార్యక్రమంలో పాల్గొన్నారు.

